Saturday, August 29, 2026
HomeLATESTBigg Boss10:సెప్టెంబర్ 6న బిగ్ బాస్ 10.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లేనా?

Bigg Boss10:సెప్టెంబర్ 6న బిగ్ బాస్ 10.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లేనా?

Bigg Boss10:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

on
- Advertisement -banner Ad

Bigg Boss10:కోట్లాదిమంది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభ తేదీని స్టార్ మా అఫీషియల్‌గా ప్రకటించింది. కొన్ని కోట్ల మంది జనాలు ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఏదో జనాలకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుందని, లేకపోతే ఇంకోటి ఏదో, ఇంకోటి ఏదో ఉంటుందని కాదు. ఎంటర్‌టైన్‌మెంట్, సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు, ఆ కంటెస్టెంట్‌ని సపోర్ట్ చేయొచ్చు, ఈ కంటెస్టెంట్‌ని తొక్కేయొచ్చు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది జనాలు ఎప్పుడూ బిగ్ బాస్ కోసం పడిగాపులు కాస్తూనే ఉంటారు. అలాంటి వాళ్లకి ఇది నిజంగా వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభ తేదీ ఫిక్స్ :

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10(Bigg Boss10) అఫీషియల్ డేట్ రాకముందే సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం జరిగింది. అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులను బిగ్ బాస్ 10లోకి పంపించేందుకు పెట్టిన టాస్కులు విపరీతంగా వైరల్ అయ్యాయి. కొంతమంది అగ్నిపరీక్షను ఎంతలా తిట్టుకున్నారో చూశాం. మరి కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ అయితే ఏకంగా సోషల్ మీడియా వేదికగా దీని గురించి రియాక్ట్ అయ్యారు.

- Advertisement -
Advertisement

సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం :

ఇప్పుడు వాటన్నిటికీ ఇంకా హీట్ పెంచేసినట్లు స్టార్ మా సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభించబోతుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా చేసింది. ఎప్పటిలాగే ఈ సీజన్‌కి కూడా హోస్ట్‌గా నాగార్జుననే ఫిక్స్ చేసింది. నాగార్జునతో స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈసారి అంతకుమించిన రేంజ్‌లో టాస్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది అంటూ చిన్న వీడియోతో అర్థమైపోయింది.

ALSO READ:irumudi:రవితేజ ‘ఇరుముడి’ మూవీని మిస్ చేసుకున్న ముగ్గురు స్టార్ హీరోలు వీళ్లే..!

- Advertisement -
Advertisement

హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లేనా?:

ఇక యథావిధిగా ఎప్పటిలాగే సోషల్ మీడియాలో హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ట్రెండ్ అవుతారు. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి పల్లవి గౌడ, తేజస్విని, ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రాంప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, యూట్యూబ్ నందు, కడలి సత్యనారాయణ, ఆట సందీప్ భార్య జ్యోతి, తేజస్విని, హీరో అబ్బాస్ వెళ్లబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా అగ్నిపరీక్షను దాటుకొని నలుగురు సామాన్యులు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వెళ్లబోతున్నారు.

ALSO READ:Jabardasth Varsha:‘మల్లెపూల పల్లకి’ పాటకు జబర్దస్త్ వర్ష అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్!

- Advertisement -
Advertisement

ట్రోఫీ ఎవరి సొంతం? :

దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు టెలికాస్ట్ అవుతుందా అంటూ కామనర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఎవరు ట్రోఫీ దగ్గర చేస్తారో జనాలు చూడాలి. చరిత్ర తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తూ కామనర్స్‌కి ట్రోఫీ అందజేసే విధంగా ఓట్లు వేస్తారా? లేకపోతే టాలెంట్ గుర్తించి ఎవరైతే హౌస్‌లోకి కరెక్ట్‌గా గేమ్ ఆడతారో వాళ్లకి ట్రోఫీ వచ్చేలా చేస్తారా? తెలియాలి అంటే మరికొద్ది వారాలు ఆగాల్సిందే. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you