TV:శనివారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే హాయిగా సమయం గడపాలనుకునే సినీ ప్రియులకు టెలివిజన్ ఛానళ్లు అదిరిపోయే సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్, భక్తి చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రోజు బుల్లితెరపై(TV) సందడి చేయనున్నాయి. ముఖ్యంగా కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు సినిమాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మరి ఏ ఛానల్లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం..!
డీడీ యాదగిరి:
డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ “అన్ ది లైన్” ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “మురళీకృష్ణుడు”, రాత్రి 9.30 గంటలకు “గ్యాంగ్ లీడర్” టెలికాస్ట్ అవుతాయి.
ALSO READ:Nagarjuna:నాగార్జున 100వ మూవీ గ్లింప్స్ రిలీజ్..!
ఈటీవీ ప్లస్, ఈటీవీ :
ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు “ఆకాశ వీధిలో”, రాత్రి 9.30 గంటలకు “మహా నగరంలో మాయగాడు” ప్రసారం కానున్నాయి. ఈటీవీలో ఉదయం 9 గంటలకు “బావ నచ్చాడు”, అర్ధరాత్రి 12 గంటలకు ఇదే సినిమా మరోసారి ప్రసారం కానుంది.
ఈటీవీ సినిమా :
ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు “నేటి సిద్ధార్థ”, ఉదయం 10 గంటలకు “ఓం నమో వెంకటేశాయ”, మధ్యాహ్నం 1 గంటకు “కిల్లర్”, సాయంత్రం 4 గంటలకు “మురళీకృష్ణుడు” ప్రసారం కానున్నాయి. రాత్రి 7 గంటలకు “లాహిరి లాహిరిలో”, రాత్రి 10 గంటలకు “జై భజరంగబలి”, మిడ్నైట్ 1 గంటకు “నేటి సిద్ధార్థ” టెలికాస్ట్ అవుతాయి.
ALSO READ:Bigg Boss10:సెప్టెంబర్ 6న బిగ్ బాస్ 10.. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లేనా?
జెమిని ఛానళ్లలో :
జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “స్వయంవరం”, సాయంత్రం 4.30 గంటలకు “నవోదయం” వస్తాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు “నేనున్నాను”, మధ్యాహ్నం 3.30 గంటలకు “అవతారం” ప్రసారం కానున్నాయి.
జెమిని మూవీస్‌లో “బాల నాగమ్మ”, “జాకీ”, “డిస్కో రాజా”, “చెప్పవే చిరుగాలి”, “సరదా బుల్లోడు”, “అదృష్టం”, “డమరుకం”, “గోవిందా గోవిందా” సినిమాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి.
జీ తెలుగు, జీ సినిమాలు:
జీ తెలుగులో ఉదయం 3 గంటలకు “జై చిరంజీవ”, ఉదయం 9 గంటలకు “స్నేహంకోసం”, సాయంత్రం 5 గంటలకు “రారండోయ్ వేడుక చూద్దాం” ప్రసారం కానున్నాయి.
జీ సినిమాల్లో “బొమ్మరిల్లు”, “బాడీగార్డ్”, “కుటుంబస్థాన్”, “బంగార్రాజు”, “అతడు”, “స్పైడర్”, “క్రైమ్ 23” సినిమాలు రోజంతా అలరించనున్నాయి.
స్టార్ మా ఛానళ్లలో :
స్టార్ మాలో “తొలిప్రేమ”, “కొత్త బంగారులోకం”, “రెమో”, “మాస్” ప్రసారం కానున్నాయి. స్టార్ మా మూవీస్‌లో “మన్మధుడు”, “కుబేర”, “నా సామిరంగ”, “సలార్”, “టిల్లు 2” వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
స్టార్ మా గోల్డ్‌లో “వైజయంతి”, “జప్పా”, “శ్రీరామదాసు”, “సీతారామరాజు”, “నిన్నే పెళ్లాడతా”, “మన్మధుడు”, “సూపర్” వంటి సినిమాలు ప్రసారం కానున్నాయి.
అందుకే ఈ శనివారం ఇంట్లోనే సినిమాతో ఎంజాయ్ చేయాలనుకునేవారికి బుల్లితెర మంచి వినోదాన్ని అందించనుంది.




