Tollywood:శ్రీనివాస్ అవసరాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనదైన శైలితో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత విభిన్న కథాంశాలతో సినిమాలు రూపొందించారు. మరోవైపు నటుడిగానూ పలు చిత్రాల్లో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
టాలీవుడ్ హీరో గురించి షాకింగ్ కామెంట్స్:
ప్రస్తుతం శ్రీనివాస్ అవసాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన ఓ టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. వీడియోను మొదటిసారి చూసినప్పుడు నిజంగానే ఓ హీరో గురించి శ్రీనివాస్ అవసరాల ప్రతికూలంగా మాట్లాడుతున్నారేమో అనే అభిప్రాయం కలగొచ్చు. అయితే వీడియోను పూర్తిగా చూస్తే అసలు విషయం అర్థమవుతుంది.
ఓ టాలీవుడ్ యువ హీరో నిద్రలో నడిచే అలవాటు ఉందని శ్రీనివాస్ అవసరాలు చెప్పుకొచ్చారు. అలా నిద్రలోనే ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతుంటాడని, ఆ సమయంలో అతడు ఏం చేస్తున్నాడో అతనికే తెలియదని వివరించారు. అంతేకాకుండా నిద్రలోనే మనుషులపై దాడి చేసి హత్యలు చేస్తాడని, తెల్లారిన తర్వాత ఏమీ తెలియనట్లుగా సాధారణంగా ఉంటాడని చెప్పడం వీడియోలో ఆసక్తికరంగా మారింది.
ALSO READ:TV:శనివారం టీవీలో సూపర్‌హిట్ సినిమాల జాతర.. !
ఇదంతా సినిమా ప్రమోషన్‌లో భాగమే!:
అయితే ఈ వ్యాఖ్యలన్నీ నిజ జీవితానికి సంబంధించినవి కావు. శ్రీనివాస్ అవసరాలు నటిస్తున్న ‘టార్టాయిస్’ అనే కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ప్రమోట్ చేయడానికి ఈ తరహా వీడియోను విడుదల చేసినట్లు అర్థమవుతోంది.
ALSO READ:Nagarjuna:నాగార్జున 100వ మూవీ గ్లింప్స్ రిలీజ్..!
హీరో ఎవరు? నెటిజన్లలో ఆసక్తి:
ఈ సినిమాలో అసలు హీరో ఎవరు? కథ ఏంటి? అనే విషయాలను మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. పూర్తి వివరాలను రేపు వెల్లడించనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియోపై చర్చ జోరందుకుంది.
వీడియో చూసిన నెటిజన్లు అందులో ప్రస్తావించిన హీరో ఎవరనే దానిపై తమదైన శైలిలో అంచనాలు వేస్తున్నారు. కొందరు అల్లరి నరేష్ పేరు ప్రస్తావిస్తుండగా, మరికొందరు నాని అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు నాగశౌర్య అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఊహాగానాలకు తెరపడాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Srinivas Avasarala makes some SHOCKING STATEMENTS about A Young Hero! 👀
https://t.co/sSNIEmaGuk#TortoiseMovie 🐢🎬. pic.twitter.com/SsXUR6XuEi— Telugu Film Producers Council (@tfpcin) August 28, 2026




