Tuesday, September 1, 2026
HomeLATESTSardar 2 trailer:సర్దార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్..

Sardar 2 trailer:సర్దార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్..

Sardar 2 trailer: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఇటీవల నటించి మంచి విజయం అందుకున్న సర్దార్ మూవీకి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

on
- Advertisement -banner Ad

Sardar 2 trailer:కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరోలలో హీరో కార్తీ కూడా ఒకరు.. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అందుకే తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ సినిమాలు చూడడానికి మక్కువ చూపుతుంటారు. డైరెక్టర్ పిఎస్ మిత్రన్, కార్తీక్ కాంబినేషన్లో గతంలో వచ్చిన స్పై థ్రిల్లర్ యాక్షన్ చిత్రం సర్దార్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందించిందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా లో కార్తీ యాక్టింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా చివరిలో ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.

సర్దార్ 2 నుండి ట్రైలర్ రిలీజ్..

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా సీక్వెల్ ని ఇటీవలే చిత్ర బృందం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా.. సినిమా ట్రైలర్ను గడిచిన కొన్ని గంటలకు విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ట్రైలర్(Sardar 2 trailer) విషయానికి వస్తే దేశం పెను ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక రహస్య బ్లాక్ ఆఫ్ మిషన్ పూర్తి చేయడానికి జపనీస్ భాషలో ప్రావీణ్యం కలిగిన ఏజెంట్ ని రంగంలోకి దింపే నేపథ్యంతో కథ అన్నట్టుగా కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Raghu master:డాన్స్ మాస్టర్ అసోసియేషన్ లో భారీ ట్విస్ట్..!

ఆకట్టుకుంటున్న ట్రైలర్..

ముఖ్యంగా ట్రైలర్లో ఎక్కువగా పల్లెటూరి సంస్కృతి, డ్రామా నేపథ్యం కలిగి ఉన్న యువకుడి పాత్రలో, అలాగే దేశాన్ని కాపాడగలిగే ఒక గూఢచారి పాత్రలో కార్తీ కనిపించబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంక కార్తీతో తలపడే ప్రతి నాయకుడి పాత్రలో ఎస్జే సూర్య కూడా తనదైన స్టైల్ లో క్రూరమైన నటనతో ఆకట్టుకున్నట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ చేజింగ్లు, గన్ ఫైట్స్ మరియు ఉత్కంఠ భరిచే స్టంట్ సీక్వెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషలలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Prema:రెండో పెళ్లిపై భయపడనంటున్న సీనియర్ హీరోయిన్ ప్రేమ..!

సర్దార్ 2 విడుదల ఎప్పుడంటే?

సర్దార్ 2 లో మాళవికా మోహన్, ఆశికా రంగనాథ్, రజిత విజయన్ నటించారు. అలాగే నాసర్, ఆశీష్ విద్యార్థి, యోగి బాబు, బాబు ఆంటోని తదితర నటీనటులు నటిస్తున్నారు. మరి భార్య అంచనాల మధ్య సెప్టెంబర్ 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. కార్తీక్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. మార్షల్ చిత్రాలతో పాటు హిట్ ది -4 కేస్ చిత్రంలో అలాగే తన 30 ,31వ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ప్రస్తుతం పార్టీ చేతులు నాలుగు సినిమాలు ఉన్నాయి. అలాగే ఖైదీ 2 సినిమా పైన కూడా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ రాబోతోంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు గతంలో కూడా ఖైదీ 2 చిత్రం పైన అనౌన్స్మెంట్ చేశారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you