Prema:సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్ తో, నటనతో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన సీనియర్ హీరోయిన్ ప్రేమ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1995 లో సవ్యసాచి అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.తెలుగులో హీరో వెంకటేష్ నటించిన ధర్మచక్రం చిత్రం ద్వారా పరిచయమయ్యింది. ఆ తర్వాత రాయలసీమ రామన్న చౌదరి చిత్రంలో నెగటివ్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ప్రేమ.. దేవి సినిమాతో కూడా ప్రేక్షకుల గుండెల్లో గుర్తుండిపోయే పాత్రలో నటించింది.
క్యాన్సర్ రూమర్స్ పై స్పందించిన ప్రేమ..
ఒకానొక సమయంలో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ప్రేమ(Prema).. తనకు క్యాన్సర్ అంటూ వచ్చిన రూమర్స్, రెండో వివాహం అంటూ జరుగుతున్న ప్రచారంపైన తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. గతంలో తనకు క్యాన్సర్ సోకిందనే వార్తలను తాను తీవ్రంగా ఖండించింది. స్నేహితురాలని కలవడానికి న్యూజిలాండ్ కి వెళ్లిన సమయంలోనే ఈ రూమర్స్ ఎక్కువగా వ్యాప్తి చెందాయి.. సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, గౌతమి లాంటి నటీమణులు క్యాన్సర్ పైన ధైర్యంగా పోరాడి మరి జయించారంటూ గుర్తుచేసింది.
also read:Yash mother:ట్రోలర్స్ కు ఇచ్చి పడేసిన హీరో యశ్ తల్లి..!
రెండో పెళ్లి వార్తలపై ప్రేమ రియాక్షన్..
తనకు మాత్రం ఎలాంటి అనారోగ్యం లేదని , దేవుడి దయతో తాను ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానంటూ తెలిపారు. తన మీద ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం తనని చాలా బాధకు గురి చేసిందని, తల్లితండ్రుల అండతోనే తాను ధైర్యంగా ఉన్నానని తెలిపింది. ప్రేమ 2006లో జీవన్ అప్పాచ్చు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నప్పటికీ కొన్ని విభేదాల కారణాల చేత 2016లో వీరిద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ప్రేమ ఒంటరిగానే జీవిస్తోంది. ఇటీవల కాలంలో రెండవ వివాహం చేసుకోబోతోంది అంటూ కథలు కూడా వినిపించాయి.
also read:Kavya Kalyan Ram:కీరవాణి ఇంటి కోడలుగా టాలీవుడ్ హీరోయిన్..!
పెళ్లికి వయసు అడ్డం కాదు..
ఈ విషయం పైన ప్రేమ మాట్లాడుతూ..” వివాహం అనేది నా వ్యక్తిగత స్వేచ్ఛ.. జీవితాంతం తోడుగా నిలిచే సరైన , మంచి వ్యక్తి ఎదురైతే ఖచ్చితంగా వివాహం చేసుకుంటానని.. అయితే పెళ్లికి వయసుతో సంబంధం లేదని, అవసరమైతే 70 ఏళ్ల వయసులోనైనా సరే వివాహం చేసుకోవచ్చు
అందులో ఎలాంటి తప్పు లేదంటూ” తెలిపింది. ఈ విషయంపై లోకం ఏమనుకున్నా సరే వాటిని పట్టించుకోను అంటూ క్లారిటీగా చెప్పింది ప్రేమ. ఇక తన తండ్రి టూరిజం లో బస్సు డ్రైవర్ గా ఉండేవారని , తల్లి గృహిణి అని తెలిపారు. తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తన తండ్రి సినీ కెరియర్ ను వ్యతిరేకించినా.. రెండవ చిత్రానికే తనకు స్టేట్ అవార్డు రావడంతో తన గురించి పేపర్లో రాసినప్పుడు చాలా గర్వపడ్డారు అని తెలిపారు. తన తండ్రి రెండు సంవత్సరాల క్రితం మరణించడంతో తాను చాలా కృంగిపోయానని తెలిపారు. ఇక తన సోదరుడు అయ్యప్ప (మాజీ రంజీ క్రికెటర్) ,దుబాయ్ లో తన సోదరి ఉందని కూడా తెలిపారు.




