Tuesday, September 1, 2026
HomeLATESTAllu Arjun:పుష్పలో లేడీ గెటప్ వెనుక ఇంత కథ ఉందా? బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు

Allu Arjun:పుష్పలో లేడీ గెటప్ వెనుక ఇంత కథ ఉందా? బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు

Allu Arjun:పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లేడీ గెటప్‌లో కనిపించిన సన్నివేశం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

on
- Advertisement -banner Ad

Allu Arjun:అల్లు అర్జున్‌ ఇది జస్ట్‌ ఒక పేరు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. కోట్లాది మంది జనాల గుండెచప్పుడు, ఎంతోమంది ఫ్యాన్స్‌ ఎమోషన్‌ అల్లు అర్జున్‌. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో ఎంత బాగా ట్రెండ్‌ అయ్యారో, ట్రోలింగ్‌ అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌(Allu Arjun) పేరు గ్లోబల్‌ స్థాయిలో మారుమోగిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిపోయిన వెంటనే టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజు దర్శకత్వంలో ఓ స్పెషల్‌ అడ్వెంచర్స్‌ మూవీలో నటించబోతున్నాడు. దీనికి సంబంధించి ఎప్పుడైతే అధికారిక ప్రకటన వచ్చేసిందో.. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

- Advertisement -
Advertisement

also read:TV Movies:సెప్టెంబర్ 1 టీవీ మూవీస్: మంగళవారం టీవీలో సందడి చేయనున్న సినిమాలివే!

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌పై బన్నీ:

రీసెంట్‌గా ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై బన్నీ ఫోటో పడింది. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఆనందపడిపోయారు. ఈ క్రమంలోనే ఆ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అల్లు అర్జున్‌. ఈ క్రమంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన కొన్ని క్లిప్స్‌ను తన సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు.

- Advertisement -
Advertisement

‘పుష్ప’ గురించి, ప్రస్తుతం వస్తున్న మూవీస్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. అంతేకాదు, ఆయన రీసెంట్‌గా షేర్‌ చేసిన ఒక పిక్‌ సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతుంది. ఫోర్బ్స్‌ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడిన కొన్ని విషయాలను ఇన్‌స్టాలో పిక్స్‌ రూపంలో షేర్‌ చేశాడు అల్లు అర్జున్‌. ఇవి చాలామందిని ఆకర్షిస్తున్నాయి.

also read:Sardar 2 trailer:సర్దార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్..

- Advertisement -
Advertisement

‘పుష్ప’లో లేడీ గెటప్‌పై బన్నీ కామెంట్స్‌:

‘పుష్ప’ సినిమాలో లేడీ గెటప్‌ ధరించడం వల్ల ఎదురైన ఒత్తిడి, ఫేస్‌ చేసిన ప్రాబ్లమ్స్‌ గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన లైఫ్‌లో అత్యంత క్లిష్టమైన పాత్ర, అలాగే దమ్మున్న ఆల్ఫా క్యారెక్టర్‌ ఏదైనా ఉంది అంటే అదే అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

“ఒత్తిడి అనేది జీవితంలో అరుదుగా లభించే ఓ గొప్ప వరం లాంటిది. దేశంలో కొద్దిమందికి మాత్రమే అలాంటి అవకాశం లభిస్తుంది. అది నాకు రావడం నిజంగా అదృష్టం. ఇప్పుడు జనాలు యావరేజ్‌ కంటెంట్‌ను అసలు పట్టించుకోవడం లేదు. రెగ్యులర్‌ సినిమాలను అసలు చూడడం లేదు. ఒక గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే నటీనటులనే ఎంకరేజ్‌ చేస్తున్నారు.

ఇంకా బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ అంటే వేరే మ్యాటర్‌. అదంతా పక్కన పెట్టేయాలి. ‘పుష్ప’ సాధించిన విజయం భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టుకు తీసుకెళ్లేలా నన్ను ప్రేరేపిస్తుంది. అందుకే ‘పుష్ప’ సినిమా నా లైఫ్‌లో చాలా చాలా స్పెషల్‌. ఒత్తిడిని నేను ఒక రెస్పెక్ట్‌గా ఫీల్‌ అవుతున్నాను. అది నాకు దక్కిన అరుదైన గౌరవంగా అనుకుంటున్నాను” అంటూ బన్నీ చెప్పాడు. ఆయన షేర్‌ చేసిన పిక్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you