Balakrishna:ఎస్.. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సెప్టెంబర్ 6 వస్తుందంటే చాలా మంది నందమూరి అభిమానులకు ఒక తెలియని పూనకం వచ్చేస్తూ ఉంటుంది. ఆ రోజు విశేషం ఏంటంటే.. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు. ఆ రోజును ఒక పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు నందమూరి అభిమానులు. ప్రతి సంవత్సరం కూడా మోక్షజ్ఞ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి నందమూరి మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా బాలయ్య అభిమానులకు ఒక సెన్సేషనల్ అప్‌డేట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అంటూ తెలుస్తుంది.
బాలయ్య సినిమా అప్‌డేట్‌పై ఆసక్తి:
ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఈ సినిమాపై ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
గతంలో బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ అని ఫస్ట్ గ్లింప్స్‌తో బాలయ్య స్టైలిష్, పవర్‌ఫుల్ లుక్‌ను రివీల్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు. ఏదైనా అప్‌డేట్ బయటకు వస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
also read:Allu Arjun:పుష్పలో లేడీ గెటప్ వెనుక ఇంత కథ ఉందా? బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు
మోక్షజ్ఞ బర్త్‌డేకు డబుల్ ట్రీట్ :
ఇలాంటి మూమెంట్‌లోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశారు టీం. మోక్షజ్ఞ బర్త్‌డే వేళ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య రెడీ అయిపోయారు. మోక్షజ్ఞ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పాటు సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్, అంతేకాదు సినిమా థియేటర్ విడుదల తేదీని కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.
దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ హంగామా నెలకొంది. బాలయ్య కొడుకు బర్త్‌డే, పైగా బాలయ్య నటిస్తున్న నెక్స్ట్ సినిమా టైటిల్, దాంతో పాటు థియేట్రికల్ డేట్ కూడా ఒకేసారి.. మూడు న్యూస్‌లు. ఇక నందమూరి ఫ్యాన్స్‌ను ఆపగలమా? సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తున్నారు.
also read:TV Movies:సెప్టెంబర్ 1 టీవీ మూవీస్: మంగళవారం టీవీలో సందడి చేయనున్న సినిమాలివే!
కీలక పాత్రల్లో కాజల్, మంచు మనోజ్ :
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక నెగెటివ్ పాత్ర అంటూ తెలుస్తుంది.
బాలయ్య-తమన్ కాంబోపై భారీ అంచనాలు :
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్య-తమన్ కాంబో అంటే స్పీకర్లు పేలిపోవాల్సిందే. ఆ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇక గోపీచంద్ మలినేని, కాజల్ అగర్వాల్, బాలయ్య కాంబినేషన్‌లో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.




