Wednesday, September 2, 2026
HomeLATESTMamitha Baiju:ఆస్పత్రిలో చేరిన మమిత బైజు..!

Mamitha Baiju:ఆస్పత్రిలో చేరిన మమిత బైజు..!

Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమత బైజు తాజాగా హాస్పిటల్ లో చేరారు ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అధికారిక ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

on
- Advertisement -banner Ad

Mamitha Baiju:మలయాళ బ్యూటీ మమితా బైజు.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా భారీ విజయాలు అందుకోవడమే కాకుండా ఏకంగా హ్యాట్రిక్ అందుకుంది. రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రాలతో మరోసారి వైరల్ గా మారింది. తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మమితా బైజు(Mamitha Baiju) ఆసుపత్రిలో చేరినట్లుగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

హాస్పిటల్లో చేరిన మమిత బైజు..

ప్రస్తుతం మమితా బైజు వైద్యుల సలహా మేరకే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది .దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన కూడా రద్దు అయినట్లుగా సమాచారం. మెల్ బోర్న్ లో జరగాల్సిన ఓనం వేడుకలకు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. Clyde onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా.. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా కి కూడా వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నేపథ్యంలో ఆ పర్యటనను సైతం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మమిత పాల్గొనాల్సిన ఈ ఓనం వేడుకలను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Badshah Divorce:కోట్లాది మంది ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్..స్టార్ సింగర్ విడాకులు..!

ఆస్ట్రేలియాలో సెలబ్రేషన్స్ వాయిదా..

మమిత బైజుకి సంబంధించి వైరల్ అయిన వీడియోలో ప్రియమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులారా సెప్టెంబర్ 5వ తేదీన జరగాల్సిన ఓనమ్ వేడుకల గురించి ఒక బాధాకరమైన విషయం పంచుకోవడం చాలా బాధగా ఉంది.. అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలియజేసింది. ఆస్ట్రేలియా కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం పట్ల తాను నిరాశ చెందుతున్నానని తన ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ పర్యటన రద్దు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదంటూ తెలిపింది.. అంతేకాకుండా నిర్వాహకులకు తన రాక కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు తెలిపారు. అంతేకాకుండా క్లయిడ్ మలయాళి అసోసియేషన్ సభ్యులకు కూడా తాను కలుస్తానని , అందరికీ క్షమాపణలు చెబుతానని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Pawan Kalyan Birthday:పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. చిరంజీవి స్పెషల్ విషెస్ వైరల్!

వీడియో విడుదల చేసిన మమిత బైజు..

ఇటీవల విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మమిత బైజు ఆసుపత్రిలో చేరిన విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న మమితా బైజు ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించి కొత్త తేదీని సైతం నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమైతే ఇప్పుడు వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you