Wednesday, September 2, 2026
HomeLATESTOG 2:ఓజి 2 పై అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ వైరల్..!

OG 2:ఓజి 2 పై అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ వైరల్..!

OG 2: పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓ.జి యూనివర్స్ నుంచి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

on
- Advertisement -banner Ad

OG 2:సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం చేత మెగా అభిమానులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ల విషయం పైన కూడా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారికి తగ్గట్టుగానే తాజాగా డైరెక్టర్ సుజిత్ ఓజి 2 (OG 2)చిత్రం పైన ఒక కీలకమైన అప్డేట్ ఇస్తూ వీడియో ని విడుదల చేశారు. ఓజీ 2 సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

OG యూనివర్స్ నుండి అదిరిపోయిన వీడియో..

తాజాగా ఓజీ సీక్వెల్ ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక చిన్నపాటి గ్లింప్స్ వీడియో ను విడుదల చేయగా.. ఈ వీడియోలో ఓజి యూనివర్స్ గురించి పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ సుజిత్ తో పాటు తమన్ మధ్య జరిగిన డిస్కషన్ ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే తమన్ ఓజీ సీక్వెల్ గురించి పలు విషయాలను పంచుకోవడం చూడవచ్చు. ఓజి 2 చిత్రాన్ని పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ తో సౌత్ ఈస్ట్ ఏసియన్ ఎమోషన్స్, అలాగే వెస్ట్రన్ ప్రజెంటేషన్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా తమన్ తెలియజేశారు. ఇప్పటినుంచి కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ అంటూ తమన్ చెప్పడం అభిమానులను మరింత విశేషంగా ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

also read:Mamitha Baiju:ఆస్పత్రిలో చేరిన మమిత బైజు..!

ఆడియన్స్ కి ఊహించని సర్ప్రైజ్..

అలాగే ఇందులో మరొక చర్చ ఏమిటంటే.. ఈ కథలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి కొన్ని కీలకమైన అంశాలను యాడ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని హింట్ కూడా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. ఇవన్నీ చేస్తే మనం చివరికి బెస్ట్ అవుట్ ఫుట్ ఇద్దామంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చివరిలో వచ్చిన యానిమేషన్ విజువల్స్ హైలెట్ గా ఉన్నాయని చెప్పవచ్చు. సమురాజ్ స్టైల్ కత్తి యుద్ధాలు అలాగే జపనీస్ గెటప్పులు కత్తులతో పవన్ కళ్యాణ్ చేసిన విన్యాసాలు ఓజీ 2 పై అంచనాలను పెంచేశాయి.

- Advertisement -
Advertisement

also read:Badshah Divorce:కోట్లాది మంది ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్..స్టార్ సింగర్ విడాకులు..!

 త్వరలో రిలీజ్ డేట్..

మరి రాబోయే రోజుల్లో ఈ సీక్వెల్ పైన మరిన్ని అప్డేట్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో నటీనటుల ఎంపిక విషయంపై కూడా ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫోకస్ కూడా కేవలం ఓజీ 2 సినిమా పైన ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాని ఎప్పుడు టార్గెట్ పెట్టుకొని మరి విడుదల చేస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అటు అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు ,రాజకీయ నాయకుడు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఓజి చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా చాలా స్టైలిష్ లుక్కులో అదరగొట్టేశారు. మరి ఓజి 2 లో ఎలా ఉంటారో చూడాలి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

 

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you