Thursday, September 3, 2026
HomeLATESTRashmika:"పెళ్లయ్యాక 3 నెలలు విడిగానే ఉన్నాం"..పరసనల్ మ్యాటర్ బయట పెట్టిన రష్మిక!

Rashmika:”పెళ్లయ్యాక 3 నెలలు విడిగానే ఉన్నాం”..పరసనల్ మ్యాటర్ బయట పెట్టిన రష్మిక!

Rashmika:రష్మిక మందన్న పెళ్లి తర్వాత మూడు నెలల పాటు విడిగా ఉన్నామని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Rashmika:రష్మిక మందన్న.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. నేషనల్ స్టార్ హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్, కోట్లాది మంది అబ్బాయిల మనసులు కొల్లగొట్టిన అందాల ముద్దుగుమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ట్యాగ్స్. రష్మిక మందన్న పేరు చెబితే ఊగిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు. ఆమెను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, ఆమె చేసిన పనులనే తమ లైఫ్‌లో చేసే అమ్మాయిలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. రష్మిక అంటే ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్‌గా మారిపోయింది.

విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత.. వైరల్ అవుతున్న రష్మిక కామెంట్స్ :

రష్మిక(Rashmika) విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ హంగామా నడిచిందో అందరికీ తెలిసిందే. పెళ్లి, హల్దీ, రిసెప్షన్ వీడియోస్ సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. పెళ్లి తర్వాత ఎవరైనా సరే భార్యాభర్తలు కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. స్టార్ సెలబ్రిటీస్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది మూవీస్‌కు కమిట్ అయినా సరే, వాటికి బ్రేక్ చెప్పి హ్యాపీగా హనీమూన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ రష్మిక మందన్న మాత్రం చాలా డిఫరెంట్. వర్క్ కమిట్‌మెంట్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది.

- Advertisement -
Advertisement

ALSO READ:I’m Game Movie Review: యాక్షన్, క్రైమ్‌తో దుల్కర్ చేసిన గేమ్ ఎలా ఉంది?

మూడు నెలల పాటు దూరంగా ఉన్న రష్మిక, విజయ్ :

రష్మిక(Rashmika) వర్క్ కోసం సొంత భర్తను కూడా దూరం పెడుతుంది. అదే విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లయిన తర్వాత వాళ్లిద్దరూ మూడు నెలల పాటు దూరంగా ఉన్నారు అంటూ సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది.

- Advertisement -
Advertisement

పెళ్లయిన తర్వాత మూడు నెలల పాటు మేము దూరంగా ఉన్నామని, ఒకరినొకరం చూసుకోలేదని, దానికి కారణం మా బిజీ షెడ్యూల్స్ అని రష్మిక చెప్పుకొచ్చింది. ఫోన్‌లో మాత్రమే మాట్లాడుకునేవాళ్లమని, పెళ్లయిన మూడు నెలల్లో వాళ్లు ఎలా గడిపామో అన్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకుంది.

ALSO READ:TV:గురువారం టీవీలలో అదిరిపోయే సినిమాల జాతర!

- Advertisement -
Advertisement

ఆ గాయం కారణంగానే విశ్రాంతి దొరికిందా? :

“నాకు విశ్రాంతి ఇచ్చేందుకు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవడానికి యూనివర్స్ ఇలా నాకు గాయం అయ్యేలా చేసిందేమో” అని కొన్ని కొన్ని సార్లు డౌట్ వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లయిన తర్వాత వాళ్లిద్దరూ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని, ఈ గాయం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని రష్మిక చెప్పింది. గాయం కొన్ని కొన్ని సార్లు మంచే చేస్తుందని చెప్పుకొచ్చింది.

విజయ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు :

పెళ్లయిన తర్వాత మేమిద్దరం ఇలా గడపడం చాలా హ్యాపీగా అనిపించిందని రష్మిక చెప్పుకొచ్చింది. విజయ్ తనను చాలా బాగా చూసుకుంటాడని తెలిపింది. ఇక విజయ్ దేవరకొండ గురించి చెబుతూ.. ఆయనకు సీరియస్ డ్రామాలు, అదే విధంగా కేర్ డ్రామాలు ఎక్కువగా నచ్చుతాయని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక మందన్న చెప్పిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రష్మిక బిజీ బిజీ:

రష్మిక, విజయ్ దేవరకొండ త్వరలోనే గుడ్ న్యూస్ చెబితే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. రష్మిక మందన్న ‘మైసా’ సినిమా షూట్‌లో బిజీగా ఉంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ఆమెలోని మరో యాంగిల్‌ను బయటపెట్టింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you