Saturday, October 10, 2026
HomeLATESTRohini :రౌడీ రోహిణి పెళ్లిపై హింట్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన లేడీ కమెడియన్!

Rohini :రౌడీ రోహిణి పెళ్లిపై హింట్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన లేడీ కమెడియన్!

Rohini :'ఫైనల్లీ అనుకున్నది జరుగుతోంది. నా సోల్‌మేట్ దొరికాడు' అంటూ డిసెంబర్ ప్రస్తావనతో పాటు పూల ఎమోజీలను చేర్చింది రోహిణి.

on
- Advertisement -banner Ad

Rohini :తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో రౌడీ రోహిణి ఒకరు. తన మాటలతో, హావభావాలతో నవ్వులు పూయించే ఆమెకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆదివారం విత్ స్టార్ మా పరివారం వంటి కార్యక్రమాల ద్వారా రోహిణి ప్రేక్షకులకు మరింత చేరువైంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్లలో ఆసక్తిని పెంచింది. తనకు సోల్‌మేట్ దొరికాడంటూ చేసిన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యపరిచిన రోహిణి.. ఆ తర్వాత మరో ట్విస్ట్ ఇచ్చింది.

పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు :

రోహిణి (Rohini )పెళ్లి గురించి గతంలోనూ పలు సందర్భాల్లో చర్చ జరిగింది. తనకు మంచి జీవిత భాగస్వామి దొరకాలని ఆమె కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇటీవల ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో జరిగిన ఓ బుట్ట టాస్క్ సందర్భంగా తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ ఏడాదైనా తన వివాహం జరగాలని, తన మెడలో వరమాల పడాలని కోరుకుంటున్నట్లు సరదాగా చెప్పింది. దీంతో ఆమె పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss:బిగ్ బాస్ తెలుగు 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఆ లిస్ట్ ఇదే!

సోల్‌మేట్ దొరికాడంటూ పోస్ట్ :

ఈ నేపథ్యంలో రోహిణి తాజాగా ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె అందమైన పింక్ కలర్ దుస్తుల్లో కనిపించింది. ఓ యువకుడి ముఖాన్ని చూపించకుండా, అతడి చేతిని పట్టుకుని సిగ్గుపడుతున్నట్లుగా ఫొటోకు పోజిచ్చింది. ఈ చిత్రంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా పోస్ట్ చేసింది.

- Advertisement -
Advertisement

‘ఫైనల్లీ అనుకున్నది జరుగుతోంది. నా సోల్‌మేట్ దొరికాడు’ అంటూ డిసెంబర్ ప్రస్తావనతో పాటు పూల ఎమోజీలను చేర్చింది. దీంతో నిజంగానే రోహిణి తన జీవిత భాగస్వామిని ఎంచుకుందా? త్వరలో పెళ్లి వార్త చెప్పబోతుందా? అంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. పలువురు ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

also read:Poonam Kaur :మళ్లీ వార్తల్లోకి త్రివిక్రమ్–పూనమ్ కౌర్ వివాదం.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

- Advertisement -
Advertisement

అభిమానులకు షాక్ ఇచ్చిన రోహిణి :

అయితే, రోహిణి గతంలోనూ పెళ్లి విషయంపై సరదాగా పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓసారి ఏఐ ద్వారా రూపొందించిన యువకుడి ఫొటోను షేర్ చేస్తూ అతడే తన భర్త అన్నట్లుగా పేర్కొంది. దీంతో ఆమె చేసిన తాజా పోస్ట్ నిజంగానే పెట్టిందా? లేక సరదాగా చేసిన వ్యాఖ్యనా? అనే చర్చ మొదలైంది.

అభిమానులు ఈ ఫొటోను చూసి పెళ్లి వార్త నిజమేనని భావిస్తున్న సమయంలోనే రోహిణి అసలు విషయం వెల్లడించింది. ఆ ఫొటోను కొద్దిసేపటికే తొలగించి, అది ఓ షోలో భాగంగా చేసిన ప్రాంక్ అని స్పష్టం చేసింది. ‘సారీ గైస్.. ఒక షోలో అది ప్రాంక్. లవ్ యు ఆల్’ అంటూ మరో స్టేటస్ పెట్టింది.

దీంతో రోహిణి నిజంగానే పెళ్లి చేసుకోబోతోందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. మొత్తానికి, తన పెళ్లి వార్తతో అందరిలో ఆసక్తి రేకెత్తించిన రోహిణి.. చివరకు ఇదంతా ప్రాంక్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్, దాని వెనుక ఉన్న ట్విస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you