Rashmika mandanna:టాలీవుడ్ క్యూట్ కపుల్స్ రష్మిక, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం రణబాలి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండియన్ బ్రిటిష్ వారి మధ్య జరిగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం. గురువారం రోజున భారీ అంచనాల మధ్య ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించగా అక్కడికి విజయ్ దేవరకొండ తో పాటుగా చిత్ర బృందం మాత్రమే వచ్చారు. కానీ అక్కడ రష్మిక కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరుకాని రష్మిక..
రణబాలి సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోవుతోంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హీరోయిన్ హాజరు కాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా వివాహమనంతరం రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా కావడంతో ఆమె ఎందుకు రాలేదనే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. ఈ విషయం పైన విజయ్ స్పందిస్తూ రష్మికాకు ఇతర సినిమాల షూటింగ్ ప్రమోషన్స్లో బిజీగా ఉండడం వల్లే ఆమె రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు.. లైఫ్ అంత ఈజీగా ఉండదు డార్లింగ్ .. ప్రమోషన్ డేస్ చెప్పమని రష్మిక ఎప్పటినుంచో తనని అడిగిందని తెలిపారు.
ఏదీ మన చేతిలో లేదన్న విజయ్ దేవరకొండ..
కానీ నాకు రిలీజ్ డేట్ తప్ప మిగతా విషయాల పైన సరైన స్పష్టత లేదు ..ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో చేస్తామా? అనంతపురంలో చేస్తామా? ఏరోజు నిర్వహిస్తాం? అప్పటికి సిసి పనులు పూర్తి అవుతాయా? లేదా? అనే విషయం పైన కూడా తనకే క్లారిటీ రాలేదంటూ విజయ్ తెలిపారు. అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు డేట్స్ ఖాళీగా పెట్టుకోవాలని రష్మికకు చెప్పానని తెలిపారు. ఆమె కూడా ఆ తేదీలను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు విజయ్ దేవరకొండ కానీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజే నిర్వహించడం జరిగిందని తెలిపారు.
also read:Jabardasth Naresh:”సన్నిహితులే నన్ను ముంచేశారు”.. నరేష్ షాకింగ్ కామెంట్స్!
అందుకే రాలేదంటూ క్లారిటీ..
రష్మిక ఇప్పుడు వరుసగా మూడు నాలుగు చిత్రాలలో నటిస్తోంది . నిర్మాతలు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. నటీనటులు దర్శకుల తేదీలను అడ్జస్ట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఆమె చాలా ఒత్తిడిగా ఉంటుంది. నాకు కూడా రౌడీ జనార్ధన సినిమా షూటింగ్ ఉంది. నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. కాబట్టి ఆయనను అడిగి ట్రైలర్ లాంచ్ కి హాజరయ్యానని తెలిపారు. రష్మికకు బిజీ షెడ్యూల్ ఉండడం వల్లే రణబాలి సినిమా ట్రైలర్ ఈవెంట్ కి రావడం సాధ్యపడలేదని తెలిపారు. మన ప్లానింగ్ మొదటి నుంచి అంతా పక్కాగా ఉండదు కదా అంటూ విజయ్ దేవరకొండ తెలియజేశారు.
also read:Comrade Kalyan:కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
అక్టోబర్ 16న రణబాలి..
రణబాలి సినిమా ట్రైలర్ నిన్నటి రోజున విడుదల అవ్వడంతో సినిమా పైన మరింత అంచనాలు పెంచేశాయి. రష్మిక ,విజయ్ దేవరకొండ జోడి మరొకసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. విజయ్ దేవరకొండ చెప్పే డైలాగులు కూడా ట్రైలర్లో బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రష్మిక, విజయ్ దేవరకొండ భార్యాభర్తలుగా అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది. మరి అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రణబాలి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.




