Thursday, October 15, 2026
HomeLATESTActress Anandi:స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది..!

Actress Anandi:స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది..!

Actress Anandi: గరివిడి లక్ష్మి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరోయిన్ ఆనంది స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకోవడం వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Actress Anandi:మొదట చిన్న చిన్న చిత్రాలలో నటించి ఆ తర్వాత హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ లలో ఆనంది కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించిన ఈమె.. ప్రస్తుతం గరివిడి లక్ష్మి అనే చిత్రంలో నటించింది. సహజమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంది గరివిడి లక్ష్మి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇందులో ఈమె నటనకు ప్రశంసల కురిపిస్తున్నారు. అక్టోబర్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటువంటి తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న ఆనంది..

అయితే ఈవెంట్లో ఆనంది(Actress Anandi) మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీ లోకి వచ్చే సమయంలో ఈ సినిమా ఫీల్డ్ కు సరిపోనేమో అని.. తన మనసులో ఎక్కడో ఒక ఆవేదన ఉండేదట. సినీ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఎన్నో లెక్కలు, క్యాలిక్యులేషన్స్ ఉంటాయనే భావన ఆమె మాటల ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తన మనసులో బాధని బయటపెట్టే క్రమంలో చాలా బావోద్వేగానికి గురై స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది హీరోయిన్ ఆనంది. నటనకు ప్రాధాన్యత ఇస్తూ పాత్ర కోసం ఎంతో కష్టపడే కళాకారులకు సినీ4 పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితుల గురించి తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Kriti Sanon: ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న కృతి సనన్!

నన్ను గుర్తించకపోయినా నా నటనను గుర్తిస్తారు..

గరివిడి లక్ష్మి చిత్రంలో ఆనంది ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర సవాల్ తో కూడుకున్న అనుభవం అంటూ తెలిపింది .ముఖ్యంగా ఆ ప్రాంతపు యాస, భాషను సహజంగా పలకడంతో పాటుగా భావోద్వేగాలని తెరపైన ఆవిష్కరించేందుకు చాలా కష్టపడ్డామంటూ వివరించింది. ఏదైనా ఒక పాత్రకు న్యాయం చేయాలి అంటే కేవలం సంభాషణ మాత్రమే సరిపోదు.. ఆ వ్యక్తి జీవనశైలి మాట తీరు భావాలను కూడా అర్థం చేసుకోవాలంటే ఆనంది తెలిపింది.

- Advertisement -
Advertisement

also read:Allu Aravind:కుమారుడికి అల్లు అరవింద్ ముద్దు పేరు పెట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్..!

అభిమానుల కోరిక ఆనందాన్నిస్తోంది..

గరివిడి లక్ష్మి వంటి కళాకారిణికి ఈ సినిమా ద్వారా మరింత గుర్తింపు లభిస్తుందని ఆనంది తెలిపారు. ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం డైరెక్టర్ గౌరీ నాయుడు జమ్ము చేసిన కృషి వల్లే ఇది సాధ్యమయ్యిందంటూ ఆనంది ప్రత్యేకంగా తెలిపారు. ఇలాంటి పాత్రను తెరపైన సహజంగా ఆవిష్కరించడానికి డైరెక్టర్ పట్టుదల చాలా అవసరమని, ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరి శ్రమ ప్రేక్షకులకు చేరాలని కోరుకుంటున్నాను. తన పైన ప్రేక్షకులు చూపిస్తున్న ఈ ప్రేమ, ఆదరణకు ఎప్పుడు తాను రుణపడి ఉంటానని ఎమోషనల్ గా మాట్లాడింది ఆనంది. ఇండస్ట్రీ నన్ను గుర్తించినా.. గుర్తించకపోయినా ప్రేక్షకులు మాత్రం నా నటనను గుర్తు పెట్టుకుంటారు అంటూ తెలిపింది. నేను చేసిన ప్రతి పాత్ర కూడా మీకు గుర్తుండాలి. నాకు అవార్డులు రావాలని కోరుకుంటూ అభిమానులు ప్రస్తావించడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఇంతమంది అభిమానులు నాకు ఉండడం కూడా అదే అతిపెద్ద గౌరవం అని తెలిపింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you