Anupama Parameswaran:టాలీవుడ్, మాలీవుడ్ , కోలీవుడ్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తాజాగా ఈమె నటించిన క్రేజీ కల్యాణం సినిమా ఈ రోజున భారీ అంచనాలతో విడుదలయ్యింది. మరి కొన్ని గంటలలో ఈ సినిమా ఫుల్ రివ్యూ కూడా రానుంది.. అయితే క్రేజీ కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా వివాహం, కుటుంబం , బంధాలు, మహిళల పాత్ర పైన ఉన్న ధోరణిలను ప్రశ్నిస్తూ పలు విషయాలను తెలియజేసింది.
పెళ్లి కాకపోయినా పిల్లల్ని కంటాను..
అనుపమ (Anupama Parameswaran)వివాహం పైన స్పందిస్తూ పెళ్లి చేసుకోకపోయినా పరవాలేదు.. పిల్లల్ని కనండి అంటూ నరేష్ గారు గతంలో చెప్పారు కదా.. మా ఇంట్లో కూడా మా అమ్మ నాతో అదే చెబుతుంది. నిజానికి వివాహానికి ముందు ఒక బిడ్డ కావాలని చాలా కోరికగా ఉండేది. భవిష్యత్తులో నాకు అసలు వివాహం అవుతుందో లేదో కూడా స్పష్టత లేదు, కానీ పాపనో, బాబునో పెంచుకోవాలనే కోరిక మాత్రం చాలా బలంగా ఉన్నది. అది అడాప్షన్ ద్వారానో లేకపోతే ఐవీఎఫ్ ద్వారానో..ఎలాగైనా సాధ్యమే కదా అంటూ మొహమాటం లేకుండా తెలియజేసింది అనుపమ. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
భార్య అంటే పనిమనిషి కాదు..
అలాగే దాంపత్య జీవితంలో భార్య భర్తలు సమానత్వం గురించి కూడా మాట్లాడుతూ.. వివాహం చేసుకునేది ఉచితంగా వచ్చే పనిమనిషి కోసం కాదు.. ఆడపిల్లల బాధ్యత కేవలం వంటింటికే పరిమితం అనేలా చూడకూడదు. బయటకు వెళ్లి అలసిపోయి ఇంటికి వచ్చిన మహిళ ఒక్కతే వంటింట్లో వంట చేయాల్సి ఉంటుంది. పురుషులు విశ్రాంతి తీసుకోవడం సరైన పద్ధతి కాదు.. ఇంట్లో పనులను ఇద్దరూ కూడా సమానంగా పంచుకొని చేసుకోవడం , ఆమెకు తోడుగా నిలిచే భాగస్వామి ఉంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది అంటూ అనుపమ తనలోని ఆలోచనలను బయటపెట్టింది.
also read:supritha:సురేఖా వాణి కూతురు సుప్రీతకు ఇన్ని కష్టాలా.. తొలిసారి మనసులో మాట!
పెళ్లి విషయంలో ఎలాంటి బలవంతం లేదు..
నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అనుపమ.. తన వ్యక్తిగత జీవితం పైన మాత్రం ఎప్పుడు మొహమాటం లేకుండా ప్రస్తావిస్తుంది. ముఖ్యంగా వివాహ విషయంలో తల్లితండ్రుల నుంచి ఎలాంటి బలవంతం గానీ , తొందరపాటు గాని లేదని ఎప్పుడు మనకు ఇష్టమైతే అప్పుడు పెళ్లి అని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది. డైరెక్టర్ భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ కళ్యాణం సినిమా లో అనుపమ అద్భుతంగా నటించింది.
also read:Crazy Kalyanam:క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ : అన్ని బాగున్న సినిమాకి అదే బిగ్ మైనస్..!
గుర్తుండిపోయే పాత్రలకే మొదటి ప్రాధాన్యత..
అలాగే వీకే నరేష్, తరుణ్ భాస్కర్ తదితర నటీనటులు కీలకమైన పాత్రల పోషించారు. ఈ సినిమా పక్కా తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. అనుపమ ఎప్పుడూ కూడా ఒకే తరహా పాత్రలు చేయడం అంటే తనకు ఇష్టం ఉండదని.. సినిమా పోస్టర్ చూస్తే చాలు ఇది ఫలానా సినిమా అని ప్రేక్షకులు గుర్తుండిపోయే పాత్రలో మాత్రమే ఎంపిక చేసుకుంటానని చాలా స్పష్టంగా తెలియజేసింది. డబ్బుల కోసమే సినిమాలు చేయనని , కొత్తదనం కోసమే ప్రయత్నిస్తూ ఉంటానని తెలియజేసింది. అంతేకాకుండా గతంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా తనకి ఉందని, ఇప్పటికీ స్క్రిప్ట్ సెలక్షన్స్ లో అది ఉపయోగపడుతుందని తెలియజేసింది.




