Friday, October 16, 2026
HomeLATESTMovie Sequels:సినిమాలలో సీక్వెల్స్ హవా.. రాబోయే సినిమాలు ఇవే..!

Movie Sequels:సినిమాలలో సీక్వెల్స్ హవా.. రాబోయే సినిమాలు ఇవే..!

Movie Sequels: తాజాగా జైలర్ 3 కూడా ఉంటుందని ప్రకటించడంతో ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఎక్కువైందనే కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి

on
- Advertisement -banner Ad

Movie Sequels:సాధారణంగా ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు చివరిలో సీక్వెల్ ఉంటుందని ప్రకటిస్తుంటారు. కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా సీక్వెల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఎక్కువగా ఓటిటి వెబ్ సిరీస్ సీజన్ ల మీదే సీక్వెల్స్ వస్తూ ఉండడం ఎక్కువగా జరిగేది. కానీ ఇప్పుడు వెండితెర పైన కూడా సరిగ్గా అదే ట్రెండ్ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏదైనా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుందంటే చాలు రెండవ భాగంతో సరిపెట్టకుండా మూడవ భాగం, నాలుగవ భాగం అంటూ డైరెక్టర్లు సైతం వరుస (Movie Sequels)పెట్టి తీస్తూ ఉన్నారు.

సీక్వెల్స్ తో సినిమాల హవా..

సాధారణంగా ఓటీటీ కంటెంట్ కి మాత్రమే నిరంతరం కొత్త సీజన్స్ రావడం వంటివి చూస్తూ ఉన్నాం.. కానీ మన దర్శకులు ఇప్పుడు పూర్తిస్థాయి సినిమాలను సైతం సుదీర్ఘంగా వరుస పెట్టి సీక్వెల్స్ తీస్తూ ఉన్నారు. ఒక కథను రెండు భాగాలకే పరిమితం చేయకుండా.. వాటిని కొనసాగిస్తూ మూడు లేదా నాలుగు భాగాల వరకు బలమైన కథాంశంలో సిద్ధం చేస్తూ వాటిని తీస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జైలర్ 2. ఈ సినిమా జైలర్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించారు.

- Advertisement -
Advertisement

also read:Jailer 2 Collections: తొలి రోజే రూ.140 కోట్లు.. తలైవా బాక్సాఫీస్ విధ్వంసం!

జైలర్ 3 పై బిగ్ అప్డేట్..

ఇందులో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సిరీస్ లో జైలర్ 3 కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ నెల్సన్ కూడా హింట్ ఇవ్వడం జరిగింది. మరొక సినిమా ఏమిటంటే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చిత్రం దృశ్యం.. ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలలో మూడవ భాగం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఫ్రాంచైజీ లో భాగంగా నాల్గవ భాగం కూడా తప్పకుండా ఉంటుందని డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని హిందీలో ముగించినప్పటికీ మలయాళంలో మాత్రం దృశ్యం 4 తో తెరకెక్కించబోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Anupama Parameswaran:భార్య అంటే పనిమనిషి కాదు.. అనుపమ షాకింగ్ కామెంట్స్..!

సీక్వెల్స్ కి సిద్ధమవుతున్న మిగతా చిత్రాలు ఇవే..

అలాగే మరొకవైపు కన్నడ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకున్న కాంతార సిరీస్ కూడా రెండు భాగాలు ఇప్పటికే వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మూడో భాగం కూడా రాబోతోంది. అందుకు సంబంధించి కథను కూడా సిద్ధం చేసే పనిలో పడ్డాడు నటుడు రిషబ్ శెట్టి. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రాలలో కేజిఎఫ్, పుష్ప చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలకు పార్ట్ 3 కూడా ఉంటుందని ఆయా దర్శకులు ఎప్పుడో ప్రకటించినా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఖచ్చితంగా వస్తాయనే నమ్మకం అభిమానులలో బలంగా ఉన్నది. అలాగే హీరో సూర్య నటించిన యముడు సినిమా మూడు భాగాలు వచ్చాయి. నాల్గవ భాగం కూడా తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే ఫ్రాంచైజీలతో బాక్సాఫీస్ వద్ద దర్శకుల హవా కొనసాగుతుందని పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you