Meenakshi Chaudhary:తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి కూడా ఒకరు.. సీనియర్ హీరోలకు కూడా జోడిగా నటించి భారీ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన కెరీర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఒకే తరహా లో ఉండే పాత్రలో నటిగా నటించడం తన కెరీయర్ ను దెబ్బతీసిందని , అందుకే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేసింది. 2021లో ఇచట వాహనములు నిలుపరాదు అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రవితేజతో కిలాడి సినిమాలో నటించి మంచి క్రేజీ సంపాదించుకుంది.
ఎక్కువగా తల్లి సెంటిమెంట్ పాత్రలే వస్తున్నాయి..
ఆ తర్వాత హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకుంది. ప్రస్తుతం నాగచైతన్య నటించిన వృషకర్మ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి.మాట్లాడుతూ.. లక్కీ భాస్కర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత తన వద్దకు వచ్చిన కథలు అన్నీ కూడా దాదాపుగా తల్లి పాత్రల చుట్టూనే వచ్చాయి.. నటిగా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించాలని ఉద్దేశంతోనే తాను ఆ తరహా కథలన్నిటినీ కూడా ఆలోచించి మరి పక్కన పెట్టేసినట్లు తెలియజేసింది.
also read:Jani master:బాలయ్య బాబుకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య..!
అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను..
కేవలం గ్లామర్ లేదా ఎమోషన్ రోల్స్ కి పరిమితం కాకుండా మా ఇంటి బంగారం వంటి తరహా చిత్రాలలో యాక్షన్ సినిమాలలో నటించాలని డ్రీమ్ కూడా ఉందని తెలిపింది. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఇప్పటినుంచి ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నానని, జిమ్ములో ఎంఎంఏ, ముయో థాయ్ వంటి కఠినమైన మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నానని వెల్లడించింది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నటించిన వృషకర్మ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకే రాబోతోంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు.
also read:Jani master:బాలయ్య బాబుకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య..!
మీనాక్షి చౌదరి సినిమాలు..
ఇటీవలే వృషకర్మ సినిమా ట్రైలర్ విడుదల అవ్వగా మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంగా కనిపిస్తోంది. ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లోని కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి సినిమాల విషయానికే వస్తే ప్రస్తుత తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి ఒక సూపర్ హీరో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 60% వరకు షూటింగ్ పూర్తి అయ్యిందని , తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో ఉంటుందని తెలిపింది. అలాగే లక్కీ భాస్కర్ 2 చిత్రం పైన మాట్లాడుతూ ఆ సినిమా ఓపెన్ ఎండింగ్ ఉన్నందుకే సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని, వెంకీ సార్ పిలుపు కోసం తాను కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాం అంటూ వెల్లడించింది. అలాగే సిద్దు జొన్నలగడ్డ తో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలిపింది.




