Jani master:తెలుగు సినీ పరిశ్రమలో గత కొద్ది రోజులుగా తీవ్రదుమారాన్ని రేపుతున్న విషయం డాన్సర్స్ యూనియన్ వివాదం.. ఈ వివాదం గత కొన్ని నెలలుగా ఏదో ఒక విషయంపై వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్, అలాగే నందమూరి బాలకృష్ణ పైన చేసిన వ్యాఖ్యలలో జానీ మాస్టర్ భార్య సుమలత ఇప్పుడు తాజాగా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో నిర్మాత మండలి, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, అలాగే వైవిఎస్ చౌదరితో పాటు ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
మళ్లీ రిపీట్ చేస్తే బ్యాన్ తప్పదు..
అయితే ఈ వేదిక పైన జానీ మాస్టర్(Jani master) భార్య సుమలత మాట్లాడుతూ బహిరంగంగానే క్షమాపణలు తెలియజేశారు. మరొకసారి ఇలాంటి దాడులు జరిగితే ఐదేళ్లపాటు బ్యాన్ తప్పదంటూ ప్రసన్నకుమార్ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడిన సుమలత గతంలో జరిగిన పరిణామాల పైన విచార వ్యక్తం చేస్తున్నానని తెలిపింది. మా యూనియన్ లో జరిగిన అవకతవకల పైన మొదలైన ఈ వివాదం ఫెడరేషన్ లో గొడవలకు దారితీసిందని, నాన్ కో ఆపరేషన్ అడగడం కోసం ఛాంబర్ మీటింగ్ కి మాత్రమే వచ్చాము. ఆ సమయంలో పల్లి కేశవరావు పైన జరిగిన దాడి పట్ల తాను మనస్పూర్తిగాని క్షమాపణలు చెబుతున్నానని తెలియజేసింది.
also read:Spirit:‘స్పిరిట్’లో అలాంటి సీన్స్ ఉంటాయా? సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్!
బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సుమలత..
తనకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు లేవని క్లారిటీ ఇచ్చింది. ఇక నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ బాలయ్య గారు అంటే తనకి చాలా గౌరవమని, ఇండస్ట్రీ పెద్ద వంటి వారు వారి గురించి తప్పుగా మాట్లాడే అర్హతగాని ధైర్యం కానీ నాకు లేదు. నేను ఆ మాట అన్నందుకు చాలా బాధపడుతున్నాను. ఎలా మాట్లాడాలి? ఎలా నడుచుకోవాలి? అన్నది ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మా వివాదాన్ని పరిష్కరించమని చెప్పిన బాలయ్య బాబుకు కృతజ్ఞతలు అంటూ సుమలత చేతులెత్తి మరి నమస్కరించింది. ఇకమీదట ఇలాంటివి మళ్లీ జరగవు అని ఫెడరేషన్తో కలిసి పని చేస్తానంటూ ఆమె ఆమె ఇవ్వడం జరిగింది.
also read:Chiranjeevi:మద్యం తాగితే జీవితమే నాశనం.. చిరంజీవి కామెంట్స్..!
రాజకీయ రంగు పులమవద్దు..
తెలుగు సినిమా నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ కూడా మాట్లాడుతూ.. ఈ వివాదంలో తెరవెనుక జరిగిన కొన్ని రాజకీయా కోణాలను కూడా బయటపెట్టారు.. కొందరు తమ వ్యక్తిగత లబ్ధి కోసం సుమలతను రాంగ్ రూట్లో నెట్టేసారని.. ఛాంబర్ ఈసీ మీటింగ్‌లోకి వచ్చి అనిల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనిపైన ఫెడరేషన్ సభ్యులు సీరియస్ కావడంతో ఈ సమస్య పెద్దదయింది. చివరికి తన తప్పు తెలుసుకున్న సుమలత వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతూ ఒక లేఖను కూడా రాశారు అంటూ తెలిపారు.. ఇలాంటి గొడవలకు రాజకీయరంగు పులమవద్దు అంటూ ఆయన తెలిపారు. ఇది కేవలం జానీ సుమలత డాన్సర్స్ యూనియన్ గొడవ మాత్రమే .. వీటికి జనసేన, వైసీపీ, టిడిపి వంటి పార్టీలకు ఎలాంటి సంబంధం లేదంటూ తెలియజేశారు. బాలయ్య బాబు చెప్పడం వల్లే ఈ విషయాన్ని క్లోజ్ చేశామని తెలిపారు ప్రసన్నకుమార్..




