Kayadu lohar:ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. ఎక్కడ ఎలాంటి చిన్న విషయం జరిగిన సరే క్షణాలలో వైరల్ అవుతుంది. అయితే కొన్నిసార్లు ఈ అభిమానం హద్దులు దాటి ఇబ్బందులకు గురిచేస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది హీరోయిన్ కయాదులోహర్. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆమె ఫ్యాన్ చేసిన పనికి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టిన కయాదు తాగి పడేసిన వాటర్ బాటిల్..
అసలు విషయంలోకి వెళ్తే.. కయాదులోహర్ (Kayadu lohar)వాడిన ఒక వాటర్ బాటిల్ కు సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు వాడిన వస్తువులను వేలంలో విక్రయించడం లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కు ఏకంగా లక్షలలో ధర పెట్టడం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. కయాదూలోహర్ షూటింగ్ స్పాట్లో ఉపయోగించి పడేసిన ఒక వాటర్ బాటిల్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లో ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వాటర్ బాటిల్ ధర అచ్చం సెలబ్రెటీ రేంజ్ లో ఉండేలా రూ. 3 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా ధర చేయడం ప్రస్తుతం నెటిజన్స్ ను ఆశ్చర్యపరస్తోంది.

also read:Naga Vamshi :అనిరుధ్ వల్ల నాగ వంశీకి భారీ లాభం..!
నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..
అయితే వీటిని చూసిన తర్వాత పలువురు నెటిజన్స్ సైతం ఇదేం పైత్యం రా బాబు తాగి పడేసిన వాటర్ బాటిల్ కి ఇంత ధర పెడతారా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రెటీల క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇలా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన హీరోయిన్ ఖయాదులోహర్ అభిమానులు కూడా నవ్వుతూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది మాత్రం సెలబ్రిటీల వ్యక్తిగత వస్తువులను కూడా ఇలా ఆన్లైన్లో అమ్మటం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతమైతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:Nayanthara:లేడీ సూపర్‌స్టార్ నయనతార పవర్‌ఫుల్ అవతార్.. ‘మహశక్తి’ ట్రైలర్ చూశారా?
కయాదులోహర్ సినీ కెరియర్..
కయాదులోహర్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. 2021లో మొగిలిపేట అనే కన్నడ సినిమా ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ తర్వాత అల్లూరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా.. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత 2025లో వచ్చిన డ్రాగన్ అనే తమిళ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ..ఈ ఏడాది హీరో నాని నటించిన ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు తమిళ చిత్రాలతో పాటు ఒక మలయాళం సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో తెలుగులో మరిన్ని చిత్రాలలో నటించాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.




