Naga Vamshi :సినీ పరిశ్రమలో కొన్ని సందర్భాలలో తీసుకున్న నిర్ణయాలు ఊహించని ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా కంటెంట్ పైన ఉండే నమ్మకంతో పాటు సినీ పరిశ్రమలో ఉండే మిత్రుల సూచనలు తోడైతే మాత్రం భారీ లాభాలను అందుకుంటారు. అలా ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ 2 సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దూసుకుపోతోంది.
జైలర్ టు తెలుగు రైట్స్ దక్కించుకున్న నాగవంశీ..
జైలర్ 2 తెలుగు సినిమా హక్కులను నిర్మాత నాగవంశీ (Naga Vamshi )దక్కించుకున్నారు. దీంతో ఊహించని రీతిలో భారీగానే లాభాలు వస్తున్నట్లు వినిపిస్తోంది . అయితే ఈ డీల్ వెనుక ఉన్నది ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడిగా పేరు సంపాదించిన అనిరుధ్. ప్రముఖ నిర్మాత నాగావంశీకి అనిరుధ్ కి మధ్య స్నేహబంధం ఉంది .సుమారుగా ఆరు నెలల క్రితం హైదరాబాద్ వేదికగా జరిగిన అనిరుద్ మ్యూజికల్ కాన్సర్టును నాగ వంశీ సమర్థవంతంగా విజయవంతంగా చేశారు. అలా ఏర్పడిన స్నేహం వీరి మధ్య మరింత బలపడేలా చేసింది. ఈ క్రమంలోనే జైలర్ 2 కంటెంట్ అవుట్ పుట్ చూసిన అనిరుధ్ సినిమా అద్భుతంగా ఉందని తెలుగులో కచ్చితంగా ప్రభంజనం సృష్టిస్తుందని నిర్మాత నాగవంశీకి తెలియజేశారట.
also read:Nayanthara:లేడీ సూపర్‌స్టార్ నయనతార పవర్‌ఫుల్ అవతార్.. ‘మహశక్తి’ ట్రైలర్ చూశారా?
అనిరుద్ మాట నిజమయిందిగా..
మ్యూజిక్ డైరెక్టర్ అంతటి బలమైన భరోసా ఇవ్వడంతో ఈ విషయంలో రిస్క్ తీసుకున్నా ఇబ్బంది లేదని వెనకడుగు వేయకుండా 42 కోట్ల రూపాయల భారీ డీల్ మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ల హక్కులను నాగ వంశీ దక్కించుకున్నారు. అనిరుధ్ మాట నూటికి నూరు శాతం నిజమయి మంచి విజయాన్ని అందించింది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తొలి నాలుగు రోజులకే తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే 27 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ ని కూడా కొల్లగొట్టింది. వీటికి తోడు నైజాంలో 11 కోట్లు, సీడెడ్ లో రూ. 4.3 కోట్లు, వైజాగ్లో మూడు కోట్లకు పైగా అన్ని ప్రాంతాలలో అంచనాలకు మించి మరి కలెక్షన్స్ రాబట్టింది.
also read:Tiger Shroff:టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో నలుగురు అరెస్ట్..!
100 కోట్లు రాబట్టడం మరింత సులభం..
దీన్నిబట్టి చూస్తూ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో అంచనాలకు మించి కలెక్షన్స్ నమోదు అయ్యాయని సమాచారం. పెట్టిన పెట్టుబడిలో కేవలం నాలుగు రోజులలో ఏకంగా 66% వరకు రికవరీ సాధించడం ట్రేడ్ విశ్లేషకులను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. సాధారణంగా భారీ రేట్లు కొనుగోలు చేసిన ఇతర భాష చిత్రాలు ఇంత వేగంగా కలెక్షన్స్ రాబట్టడం అంటే అది చాలా అరుదుగా జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి జైలర్ 2 సినిమా రన్ టైం పూర్తయ్యేసరికి తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్కు అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.




