Actor Karthi:కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన కార్తీక్ తాజాగా డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సర్దార్ 2. ఈ సినిమా మొదటి భాగం సర్దార్ భారీ విజయం అందుకోవడంతో సీక్వెల్ పైన కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. ఆ ఈవెంట్లో హీరోయిన్ మాళవికను ఉద్దేశిస్తూ కార్తీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి.
హీరోయిన్ వస్త్రధారణ పై కార్తీ కామెంట్..
ఈ వేడుకలలో భాగంగా హీరో కార్తీ(Actor Karthi) మాట్లాడుతూ.. “ప్రాజెక్టులో మాళవికను ఎంపిక చేసిన విషయం తెలిసిన వెంటనే చిత్ర బృందంతో సరదాగా సంభాషించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. హాలీవుడ్ ప్రముఖ తార మోనిక బెల్లూచి తరహాలో ఈ చిత్రంలో ఆమెకి ఆకర్షణీయమైన గ్లామర్ దుస్తులు ఉంటాయా? అని తాను దర్శక నిర్మాతలను అడిగినట్లు తెలియజేశారు కార్తీ. అయితే ఈ మాటలు తన ఆనందం కోసమే కాదని, కేవలం వెండితెర పైన ప్రేక్షకులకి , అభిమానులకి వినోదం పంచడానికి మాత్రమే ప్రశ్నించాను అంటూ నవ్వుతూ తెలియజేశారు కార్తీ. ప్రస్తుతం కార్తీ కేవలం సరదా కోణంలో షేర్ చేసినప్పటికీ చాలామంది సినీ విశ్లేషకులు, నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
also read:Dancers Association: పోలీస్ స్టేషన్ కు చేరిన డాన్సర్స్ అసోసియేషన్ పంచాయతీ ..!
మండిపడుతున్న నెటిజన్స్..
బహిరంగ వేదికల పైన మహిళా నటీమణుల గురించి ఇలా ప్రస్తావించడం తప్పు పడుతున్నారు. ఈ చిత్రంలో మాళవిక ఒక గూఢచారి స్పై ఏజెంట్గా కనిపించబోతోంది. అలాంటి ప్రతిభావంతమైన పాత్రను, ఆమె నటన నైపుణ్యాన్ని పక్కనపెట్టి కేవలం ఆమె దుస్తులు గ్లామర్ చుట్టూనే మాట్లాడడం సబబు కాదు అంటూ పలువురు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎంతో గౌరవం హుందాతనం కలిగిన హీరోగా కార్తీకి మంచి గుర్తింపు ఉన్నది. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల వాటిని పోగొట్టుకుంటున్నారంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
also read:Bigg Boss:బిగ్ బాస్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్..!
కార్తీ స్పందిస్తారా?
ముఖ్యంగా సరదా ముసుగులో తన సహ నటి అయిన ఒక హీరోయిన్ గురించి ఇలా డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడడం ఆయన స్థాయికి తగదని హితువు పలుకుతున్నారు. మరి ఈ విషయం పైన హీరో కార్తీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. సర్దార్ 2 చిత్రంలో ఎస్ జె సూర్య, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్, యోగిబాబు తదితర నటీనటులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది .మరి ఈ విషయం పై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.




