Dancers Association: తెలుగు ఫిలిం డ్యాన్సర్స్ యూనియన్ అసోసియేషన్ లో గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు, వివాదాలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేస్తున్నాయి. యూనియన్ లో రెండు ప్రధాన వర్గాలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటూనే.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వరకూ వెళ్ళింది. దీంతో ఇప్పుడు మరొకసారి ఈ వివాదం తీవ్ర రూపం దాల్చినట్లు తెలుస్తోంది. డాన్సర్స్ అసోసియేషన్ (Dancers Association) చెందిన సుమలత ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన రఘు మాస్టర్ ప్యానల్ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు.
రఘు మాస్టర్ పై సుమలత కేసు ఫైల్..
వీటితో పాటుగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. రఘు మాస్టర్, ఆయన వర్గం యూనియన్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను బ్యాంకు అధికారులకు సమర్పించాలంటూ ఆమె ఆ ఫిర్యాదులో తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ డాన్సర్స్ అసోసియేషన్ చెందిన సుమలత పోలీసులను కోరడం జరిగింది. సుమలత చేసిన ఈ ఆరోపణలను రఘు మాస్టర్ తీవ్రస్థాయిలో ఖండించారు.
also read:Bigg Boss:బిగ్ బాస్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్..!
ఖండించిన రఘు మాస్టర్..
ఈ విషయం పైన రఘు మాస్టర్ మాట్లాడుతూ సుమలత కావాలని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ పోలీసులను సభ్యులను తప్పుదోవ పట్టిస్తోంది అంటూ తెలిపారు. తన న్యాయకత్వం లోని కార్యవర్గాన్ని ఫిలింనగర్ ఫెడరేషన్ అధికారికంగా గుర్తించింది అంటూ తెలియజేశారు రఘు మాస్టర్. ఫెడరేషన్ జారీ చేసిన అధికారిక అప్రూవల్ లెటర్ ఆధారంగానే తాము బ్యాంకు ని ఆశ్రయించామని, ఎలాంటి ఫోర్జరీ పత్రాలు కాని సంతకాలు కానీ ఇవ్వలేదంటూ రఘు మాస్టర్ తెలియజేశారు. యూనియన్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ రాయదుర్గం పోలీసులకు విజ్ఞప్తి చేశారు రఘు మాస్టర్. దీంతో ఇరువర్గాల నుంచి రాయదుర్గం పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసి ఘటన పైన సమగ్ర విచారణ మొదలుపెడతామని తెలియజేశారు.
also read:Yash:యశ్ టాక్సిక్ సినిమాకి భారీ షాక్!
పోలీసులు ఏమన్నారంటే..?
ముఖ్యంగా బ్యాంకు పత్రాలు ఫెడరేషన్ లేఖల ప్రామాణికతను పరిశీలించి అనంతరం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు కూడా తెలియజేశారు. గత ఏడాది డిసెంబర్లో జానీ మాస్టర్ భార్య సుమలత డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఎన్నికవ్వడం జరిగింది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఆమె పదవి కాలం ఉన్నప్పటికీ అసోసియేషన్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల కారణంగా ఆమెను తప్పించారు. ఇటీవల డాన్సర్ యూనియన్ కార్యవర్గంలో కొత్తగా ఎంపికైన సభ్యులను ప్రకటించుకున్నారు ఈ డాన్సర్స్ అసోసియేషన్ కి రఘు మాస్టర్ ప్రెసిడెంట్ కాక మెహర్ బాబు మాస్టర్ సెక్రటరీ, బసవరాజు వైస్ ప్రెసిడెంట్ గా రాజన్న జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరంతా తాత్కాలిక సభ్యులైన త్వరలో ఎన్నికలు జరుగుతాయి అంటూ కూడా రఘు మాస్టర్ తెలియజేశారు.




