Yash mother:కన్నడ హీరో యశ్ కేజిఎఫ్, కేజిఎఫ్ 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సంపాదించారు. అదే అంచనాలతో విడుదలైన తాజా చిత్రం టాక్సిక్. అయితే ఈ సినిమాని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాపై నెగటివ్ టాకు కూడా విపరీతంగా పెరిగిపోయింది . ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పైన దారుణంగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే హీరో యశ్ స్టార్డం పైన కూడా మాటలు వైరల్ గా మారడంతో ఈ విషయాల పై యశ్ తల్లి(Yash mother) చాలా ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది.
యశ్ తల్లి ఘాటు వ్యాఖ్యలు..
కేజిఎఫ్ చిత్రంతో యశ్ పాన్ ఇండియా స్టార్ హీరో అన్న సంగతం తెలిసిందే.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు భారీగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అంతకుముందు కన్నడలో యశ్ నటించిన చిత్రాల కంటే ప్రత్యేకంగా నిలిచాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే విషయాన్ని హీరో యశ్ తల్లి పుష్ప మరొకసారి బలంగా ప్రస్తావించారు. ఆమె అంతలా రియాక్ట్ కావడానికి ముఖ్య కారణం గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలే అంటూ వినిపిస్తున్నాయి. గతంలో కోటబొమ్మాలి పిఎస్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా బడ్జెట్, హీరోల మార్కెట్, స్టార్డం గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
also read:Kavya Kalyan Ram:కీరవాణి ఇంటి కోడలుగా టాలీవుడ్ హీరోయిన్..!
నాడు అల్లు అరవింద్ అన్న మాటలు మళ్ళీ వైరల్ అవుతున్నాయా?
ఆ సందర్భంలోనే భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనే విషయాన్ని వివరిస్తూనే కేజిఎఫ్ చిత్రానికి ముందు యశ్ ఎవరు అనే ప్రశ్న ప్రస్తావించారు. అప్పట్లో ఈ మాటలపై పలు రకరకాలుగా నెటిజన్స్ స్పందించారు. కే జి ఎఫ్ చిత్రాలకు ముందే యశ్ కు స్టార్ ఇమేజ్ ఉండేదని ఈ విషయాన్ని అల్లు అరవింద్ విమర్శిస్తున్నట్లుగా యశ్ అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు టాక్సిక్ సినిమా చుట్టూ కూడా జరుగుతున్న విషయంలో కూడా ఇవే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో యశ్ తల్లి పుష్ప చాలా ఘాటుగానే కౌంటర్ వేసినట్టు కనిపిస్తోంది.
also read:Ariyana Glory:హిజ్రాలపై.. అరియాన షాకింగ్ వీడియో..!
తన కొడుకు కష్టపడి పైకి వచ్చాడు అంటున్న యశ్ తల్లి..
తన కుమారుడిని కేజిఎఫ్ తో మాత్రమే గుర్తించడం పైన ప్రశ్నించగా.. యశ్ కే జి ఎఫ్ చిత్రాల కంటే ముందు కర్ణాటకలో స్టార్ హీరో.. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను కూడా తన కుమారుడు సంపాదించుకున్నారు. తర్వాతే కేజిఎఫ్ లాంటి భారీ ప్రాజెక్టులోకి వెళ్లాడని తెలిపింది. యశ్ ఎవరో తెలుసుకోవడానికి కేజీఎఫ్ వరకు ఎందుకు వెళ్లాలి అంటూ ఆమె ప్రశ్నించింది . కన్నడ సినీ పరిశ్రమలో తమ కుమారుడు సాధించిన విజయాలు, బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఇప్పటికీ తనని స్టార్ గా నిలబెట్టాయని తెలిపారు. యశ్ ఎదుగుదల వెనక ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదంటూ గుర్తు చేసింది పుష్ప. తన కుమారుడు ఎలాంటి నేపథ్యం లేకుండా కష్టపడి ఇండస్ట్రీలో తన స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. తన కొడుకుని ఉగ్రవాదిలా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరైనది కాదు అంటూ యశ్ తల్లి పుష్ప ఆవేదనను వ్యక్తం చేశారు. మరి ఈ విషయం పైన అల్లు అరవింద్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Hero #Yash paina Producer #AlluAravind gari comments.. Vaatiki Yash thalli #Pushpa gari Reaction pic.twitter.com/LIL5GTyLil
— Milagro Movies (@MilagroMovies) August 30, 2026
:




