Wednesday, September 2, 2026
HomeLATESTGautham:టాక్సిక్ సినిమాకి మహేష్ కుమారుడు రేటింగ్..!

Gautham:టాక్సిక్ సినిమాకి మహేష్ కుమారుడు రేటింగ్..!

Gautham : యశ్ టాక్సిక్ సినిమాకి మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

on
- Advertisement -banner Ad

Gautham:కేజిఎఫ్, కేజిఎఫ్ 2 చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న హీరో యశ్.. ఇటీవల నటించిన చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి నెగటివ్ టాక్ నే సంపాదించుకుంది. అయినా కూడా కలెక్షన్స్ బాగానే రాబట్టినట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే యాక్షన్ సీన్స్, బోల్డ్ సీన్స్ తప్పితే కంటెంట్ లేదంటూ చాలా మంది రివ్యూయర్లు కూడా తేల్చి చెప్పారు. కానీ మలయాళ ప్రేక్షకులు, సెలబ్రిటీలకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది అంటూ రివ్యూలు ఇస్తున్నారు.

టాక్సిక్ మూవీకి గౌతమ్ రేటింగ్..

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా టాక్సిక్ సినిమాకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయము ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లెటర్ బాక్స్ డి అనే ఖాతాలో పలు చిత్రాలకు రేటింగ్ ఇవ్వడం జరిగింది గౌతమ్(Gautham ). అందులో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషలలో సినిమాలకు గౌతమ్ రేటింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. ముందుగా తన తండ్రి మహేష్ బాబు నటించిన పోకిరి, నేనొక్కడినే చిత్రాలకు గౌతమ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Pawan Kalyan:పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా. ?

400 చిత్రాలకు పైగా రేటింగ్..

అదే సమయంలో నిజం, వంశీ చిత్రాలకు 2 స్టార్ రేటింగ్ ఇవ్వగా.. ఆ తర్వాత మహేష్ నటించిన బ్రహ్మోత్సవం చిత్రానికి కేవలం ఒక్క స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అలాగే ఇటీవలే రవితేజ నటించిన ఇరుముడి చిత్రానికి 3 రేటింగ్ ఇవ్వగా.. ఈ క్రమంలోనే యశ్ నటించిన టాక్సిక్ సినిమాకి 0.5 రేటింగ్ ఇచ్చారు.. ఇప్పుడు ఈ విషయమే అటు శాండిల్ వుడ్ , ఇటు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది . అయితే ఈ లెటర్ బాక్స్ ది ప్రొఫైల్ lo దాదాపుగా 400కు పైగా చిత్రాలకు రేటింగ్ ఇచ్చారు గౌతమ్.. హాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన ది ఒడిస్సీ, స్పైడర్ మాన్ బ్రాండ్ న్యూ డే వంటి చిత్రాలకు కూడా 4.5 రేటింగ్ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Kayadu Lohar: లంగా వోణీలో చందమామలా ఆకట్టుకుంటున్న కయాదు లోహర్.. పిక్స్ వైరల్!

క్లారిటీ ఇచ్చేది ఎవరు?

బాలీవుడ్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దురంధర్ కి 4, దురంధర్ 2 కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. లోకేష్ కనకరాజు నటించిన డిసి చిత్రానికి 4 స్టార్స్ రేటింగ్ ఇవ్వగా లైగర్ టాక్సిక్ సినిమాకి 0.5 రేటింగ్ ఇచ్చారు. ప్రభాస్ నటించిన కల్కి చిత్రానికి 2.5 , బాహుబలి 2కు 5, సీతారామం, పెళ్లిచూపులు చిత్రాలకు 4.5 ఇవ్వగా ఈగ చిత్రానికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు గౌతమ్. ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you