Monday, August 31, 2026
HomeLATESTAriyana Glory:హిజ్రాలపై.. అరియాన షాకింగ్ వీడియో..!

Ariyana Glory:హిజ్రాలపై.. అరియాన షాకింగ్ వీడియో..!

Ariyana Glory: ప్రముఖ నటి అరియానా గ్లోరీ తాజాగా హిజ్రాల గురించి వారు చేస్తున్న పనుల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Ariyana Glory:చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలనైనా సరే స్పందించడానికి మొహమాటం పడలేదు. అది తప్పయితే చాలు చాలా మంది నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలలో గృహప్రవేశం లేదా ఏదైనా కార్యక్రమాలు చేస్తున్న వారు ఎలాంటి ఇబ్బందులు పడడం లేదు. కానీ నగరాలలో ఏదైనా ఇల్లు కానీ, షాప్ కానీ ఓపెనింగ్, వివాహాం చేస్తున్నారంటే చాలు అక్కడికి గుంపులు గుంపులుగా కొంతమంది హిజ్రాలు వచ్చి మరీ డబ్బులను డిమాండ్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.

హిజ్రాలపై అరియానా షాకింగ్ కామెంట్స్..

ఒకవేళ వారు ఇవ్వకుంటే మాత్రం నానా రచ్చ చేస్తామని భయపెట్టిన సందర్భాలు కూడా సోషల్ మీడియాలో పలు రకాలు వీడియోలను చూసే ఉన్నాము. అందుకే చాలా మంది వీళ్లకు భయపడి అడిగినంత డబ్బులను ఇస్తూ ఉంటారు. రీసెంట్ టైంలో తనకు కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురయ్యిందని , బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory)తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.

- Advertisement -
Advertisement

అలా బెదిరించడం ఎందుకు – అరియానా..

ఈ వీడియోలో అరియానా మాట్లాడుతూ.. “నాకు తెలియదు.. ఇది ఎలా వెళ్తుందో నా మనసులో ఉన్నది మీతో పంచుకోవాలనుకుంటున్నాను.. నేను మాట్లాడుతున్నది.. తప్పుగా మాట్లాడుతున్నానా? సరిగా మాట్లాడుతున్నానా4 తెలియదు కానీ.. మనం చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంటాము. లేదంటే బిజినెస్ కోసం ఏదైనా షాప్ ఓపెన్ చేస్తూ ఉంటాం.. రూపాయి రూపాయి డబ్బు కూడబెట్టి మరీ ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి వెళ్తాం.. మా ఇంటి గృహప్రవేశ సమయంలో ఒక ఇన్సిడెన్స్ కూడా జరిగింది.. అప్పటికే డబ్బులు అన్ని సెట్ చేసుకొని మరి గృహప్రవేశం కార్యక్రమాన్ని చేసుకున్నాం.. సడన్గా వస్తారు.. బయట నెంబర్ రాస్తాం.. డబ్బులు ఇవ్వాలి అంటారు. లేకపోతే మా వాళ్ళు వస్తారు. మాకు ఎలాంటి కమిషన్ మిగలదు అంటారు. మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నా.. పూజ చేసుకున్నా.. కానీ వాళ్ళు వచ్చి ఇంత డబ్బులు అంత డబ్బులు అంటూ డిమాండ్ చేస్తూ ఉంటారని నిజంగా ఆ సమయంలో 3000 అయినా 10000 అయినా 20,000 అయినా సరిపోవు.. 50,000 కావాలంటారు.. ఇదంతా కూడా మనసుకు చాలా కష్టంగా ఉంటుందని తెలిపింది.

చాలా ఫీలయ్యాను – అరియానా

మనం కష్టపడి మరి కట్టుకుంటాము.ఈరోజు కోసమే మనం చాలా కష్టపడినప్పుడు సడన్గా పూజ జరుగుతున్నా.. సరే వాటిని పట్టించుకోకుండా అప్పులొల్ల లాగా వచ్చి మరీ హిజ్రాలు ఎగబడతారు. అసలు ఎగబడి ఇచ్చే ఆశీర్వాదం ఏంటి నాకు అర్థం కాలేదు.. నెంబర్ రాస్తే వేరే వాళ్ళు రారు.. ఇప్పుడు ఇవ్వకపోతే మిగతా వాళ్ళు కూడా వస్తారు అంటూ బెదిరించడం ఏంటి? అనేది అర్థం కావడం లేదంటూ అరియాన తెలిపారు.. డబ్బులు తక్కువ ఇచ్చినా బ్యాడ్ వైబ్ ఇవ్వడం ఎందుకు? ఈ విషయాలు చూసినప్పుడు నేను చాలా ఫీలయ్యాను అంటూ అరియాన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

- Advertisement -
Advertisement

A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you