Meena:మీనా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు. చాలామందికి ఫేవరెట్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సౌత్ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ. ఇప్పటికీ మీనాను ఇష్టపడి, లైక్ చేసి, ఫాలో అయ్యే వాళ్లు చాలామంది ఉన్నారు. మీనా సినిమా టీవీలో వస్తుంటే టీవీకి అతుక్కుపోయి సినిమా చూసేవాళ్లు చాలామంది ఇప్పటికీ మన మధ్యలో ఉన్నారు.
వెంకటేష్, మోహన్‌లాల్ లాంటి సీనియర్ హీరోల పక్కన ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేసి, తనదైన స్టైల్‌లో ముందుకు వెళ్లారు మీనా. అయితే, ఈ మధ్యకాలంలో తన వ్యక్తిగత జీవితం కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్‌కు గురైంది మీనా.
భర్త మృతితో ఒంటరిగానే పాపను చూసుకుంటూ..:
మీనా 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఒక పాప కూడా ఉంది. కానీ 2022లో కోవిడ్‌తో దురదృష్టవశాత్తు ఆమె భర్త చనిపోయారు. ఆ తర్వాత మీనా సింగిల్‌గానే పాపను చూసుకుంటూ లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ తనదైన స్టైల్‌లో లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తుంది. అయితే, ఆమెపై ఈ మధ్యకాలంలో చాలా మీమ్స్, ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని, ఆ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతుందని, ఈ స్టార్ డైరెక్టర్‌తో డేటింగ్‌లో ఉందని, ఇంకొక ప్రొడ్యూసర్‌తో రెండో పెళ్లి అని రకరకాలుగా పుకార్లు పుట్టాయి.
also read:Vijay Deverakonda:”అలా చేయకపోతే నేను బ్రతికి వేస్ట్”..స్టేజీ పై విజయ్ దేవరకొండ ఎమోషనల్..!
రెండో పెళ్లిపై మీనా క్లారిటీ:
దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది మీనా. అంతేకాదు, తను మళ్లీ పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందా..?? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా, కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చింది మీనా.
మీనా(Meena) మాట్లాడుతూ.. “నేను రెండో పెళ్లి చేసుకుంటానా? చేసుకోనా? అనేది నాకు తెలియదు. చేసుకుంటాను అని చెప్పను, చేసుకోను అని చెప్పను. నా లైఫ్ ఎటు పోతుందో నాకే తెలియదు. అంతా దేవుడు ఒక రాత రాసేసి ఉంటాడు. దానికి తగ్గట్టే ముందుకు వెళుతూ ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా ఇది జరుగుతుంది, ఇది జరగాలి అని ముందుకు వెళ్లను. నిజానికి నేను సినిమాలోకి వస్తానని అనుకోలేదు. హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదు. నా కూతురు సినిమాల్లోకి వస్తుందని అనుకోలేదు. నేను ఏది అనుకోకుండానే జీవితంలో అన్నీ జరిగిపోతున్నాయి. భవిష్యత్తులో కూడా అంతే. ఏం జరుగుతుందో ఊహించను. జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళుతూ ఉంటాను.
also read:OTT Movies : ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. లిస్ట్ ఇదే!
భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను :
నేను ఇంత పెద్ద హీరోయిన్ అవుతాను, తెలుగు, తమిళంలో టాప్ స్టార్స్‌తో వర్క్ చేస్తాను, ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటాను అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ జరిగాయి కదా. ఫ్యూచర్‌లో కూడా అంతే. ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేను. కానీ ఒకటి మాత్రం నిజం. లైఫ్‌లో ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తాను.
ఇప్పుడు నాకు అన్నిటికన్నా ముఖ్యం నా కూతురు. నా కూతురు ఆనందమే నాకు ఇంపార్టెంట్. ఆమె ఇష్టాఇష్టాలు, ఆమె కంఫర్ట్‌ను ఎక్కువగా గౌరవిస్తాను. ఆమె నాకు ఇప్పుడు ఉన్న బాధ్యత. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోను. నా జీవితం ఏంటో నాకు తెలుసు. వాళ్లకు తెలియదు కదా. ఏం జరిగినా సరే, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను. ఫ్యూచర్‌లో ఏదో జరుగుతుంది అని ఇప్పటినుంచే బాధపడను. అది జరగాలి అని ఇప్పటినుంచి ఆశలు పెట్టుకోను. దేవుడు ఏం పంపినా సరే హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను” అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు.
మళ్లీ వైరల్ అవుతున్న మీనా ఓల్డ్ ఇంటర్వ్యూ:
నిజానికి ఇది మీనా లేటెస్ట్ ఇంటర్వ్యూ కాదు. ఎప్పటిదో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో మీనా ఎన్నోసార్లు రెండో పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం పదే పదే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె ఫ్యాన్స్ మరోసారి ఆమె ఓల్డ్ ఇంటర్వ్యూను వైరల్ చేస్తున్నారు.




