బాలికా వధూ అనే హిందీ సీరియల్తో తన నటన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అవికాగోర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదే సీరియల్ ను తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరిట డబ్బింగ్ చేయగా అదికూడా ఊహించని టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.
ఈ సీరియల్ తీసుకొచ్చిన క్రేజ్ తో అవికా గోర్ కాలక్రమేనా హీరోయిన్గా కూడా అవతరించింది. అలా ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకొని ప్రేక్షకులను అలరించిన అవికా గోర్ ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనే అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ నటుడినే వివాహం చేసుకొని సెటిల్ అయిన ఈమె.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇకపోతే తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది .వైట్ , లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ ధరించిన ఈమె తన అందాలతో హీట్ పుట్టించేలా హొయలు పోయింది.
అవికా గోర్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోషూట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.