Sunday, July 19, 2026
HomeLATESTBalan:OTTలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. ‘బాలన్: ది బాయ్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

Balan:OTTలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. ‘బాలన్: ది బాయ్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

Balan:మలయాళ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బాలన్: ది బాయ్’ ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

on
- Advertisement -banner Ad

Balan:మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న సస్పెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాలకు ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తుంది. విభిన్న కథాంశాలు ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, ఊహించని మలుపులతో ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అదే కోవాలో మరో ఆసక్తికర చిత్రం ఓటిటి ప్రేక్షకులను అదరించేందుకు సిద్ధమయింది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న బాలన్: ది బాయ్’ చిత్రం త్వరలోనే తెలుగు లో సహా పలు భాషలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది..

జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్:

మంజుమల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ జూన్ 19న థియేటర్లలో విడుదల అయింది. ఇప్పుడు జూలై 31 నుంచి జీ5 వేదికగా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమాకు ఆవేశం చిత్ర రచయిత జితు మాధవన్ కధ అందించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు చిదంబరం టేకింగ్ జితూ మాధవన్ రచన కలిసి సినిమాను మరింత ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దాయి అంటున్నారు సినీ అభిమానులు

- Advertisement -
Advertisement

also read:TV:’ఇల్లు ఇల్లాలు పిల్లలు’ చందు సక్సెస్ సీక్రెట్ ఇదే.. యూట్యూబ్ నుంచి స్టార్ మా వరకు అద్భుత ప్రయాణం!

కథలోని ప్రధాన అంశం ఇదే :

“బాలన్: ది బాయ్” (Balan)ఒక తల్లి కొడుకుల జీవితాల చుట్టూ తిరిగే కదా కన్నూర్ మహిళా జైల్లో జన్మించిన బాలన్ ను తన గతం నుంచి రక్షించేందుకు అతని తల్లి తరచూ ఊర్లు పేర్లు మార్చుకుంటూ జీవిస్తుంది. ఎవరిని నమ్మకూడదని భావనను చిన్నప్పటి నుంచే తన కుమారుడిలో నాటుతుంది. ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితంలో ఊహించని సంఘటనలు చేసుకొని తల్లి కొడుకులను విడదీస్తాయి.

- Advertisement -
Advertisement

also read:Pavitra Lokesh:సాయి కుమార్‌తో పవిత్ర లోకేష్ స్పెషల్ సాంగ్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ వైరల్!

ఉత్కంఠ భరితమైన ప్రయాణం:

టీనేజ్ లోకి వచ్చిన బాలన్ తన తల్లిని వెతికే ప్రయత్నం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో అబ్బాస్ అనే వ్యక్తి అతనికి తోడు అవుతాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేస్తుంది. చివరకు బాలన్ తన తల్లిని కలుసుకుంటాడా..? ఆమె గతంలో దాగి ఉన్న రహస్యం ఏంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం సినిమా క్లైమాక్స్ లో తెలుస్తుంది. సస్పెన్స్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి మంచి వీకెండ్ ఛాయిస్ గా నిలిచే అవకాశం ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you