72nd National Film awards: తాజాగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టును కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇందులో నటీనటులు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఉత్తమ నటి విభాగంలో ఆర్టికల్ 370 చిత్రానికి గాను హీరోయిన్ యామి గౌతమికి జాతీయ అవార్డు లభించింది. ఇక ఈమె ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ ఆదిత్యధర్ భార్య. ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి ఇద్దరు నటులకు అవార్డులు లభించాయి. అందులో చందు ఛాంపియన్ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచిన నటుడు హీరో కార్తీక్ ఆర్యన్ తో పాటుగా మలయాళ స్టార్ నటుడు మమ్ముట్టి నటించిన భ్రమ యుగం చిత్రానికి గానూ ఉత్తమ నటుడు అవార్డు లభించింది.
అలాగే ఉత్తమ దర్శకుడు విభాగంలో తమిళ చిత్రం అమరన్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ పెరియాసామికి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద వరదరాజన్ జీవిత కథ ఆధారంగా అద్భుతంగా తెరకెక్కించారు. ఉత్తమ బాలల విభాగంలో తెలుగు సినిమాకి 35 చిన్న కథ కాదు చిత్రం ఎంపిక అయింది.
also read:Avika gor: ట్రెండింగ్ అవుట్ ఫిట్ లో హీట్ పుట్టించిన చిన్నారి పెళ్ళికూతురు.!
9 కేటగిరీల్లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు:
ఉత్తమ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం – కల్కి 2898 ఎ.డి.
ఉత్తమ బాలల చిత్రం – 31: చిన్న కథ కాదు
ఉత్తమ సంభాషణల రచయిత – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ స్క్రీన్ ప్లే – సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ బాల నటుడు – అరుణ్ దేవ్ (31: చిన్న కథ కాదు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – పి. రవికుమార్ (కమిటీ కుర్రాళ్ళు)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం – కమిటీ కుర్రాళ్ళు
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ – నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2)
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వివరాలు
ఉత్తమ నటుడు – మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ (సంయుక్తంగా)
ఉత్తమ నటి – యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్)
ఉత్తమ నేపథ్య గాయని – వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అభయ్ జోధ్ పుర్కర్
బెస్ట్ సినిమాటోగ్రఫర్ – జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం – కెప్టెన్ మిల్లర్ (తమిళం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ – నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)
బెస్ట్ ఎడిటర్ – కలైవన్నన్ (అమరన్)
బెస్ట్ సౌండ్ డిజైనర్ – మానస్ చౌదరి (భూల్ బులియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ – యోగేశ్ దేశ్‌పాండే
ఉత్తమ పాటల రచయిత – మనోజ్ ముంతాసిర్ (మైదాన్)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – శశ్వంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ తమిళ చిత్రం – రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం – ఫెమినిస్ట్ ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం – మిథ్య (ఇల్యూజన్)
ఉత్తమ హిందీ చిత్రం – శ్రీకాంత్
ఉత్తమ గుజరాత్ చిత్రం – మారన్ (ద హంట్)
ఉత్తమ బెంగాలీ చిత్రం – చల్‌చిత్ర ఎఖో
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత – ప్రదీప్‌కుమార్ శెట్టి (కన్నడ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్ మెన్షన్ – ద చోలా డోరా ఔర్ సూయి
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్ మెన్షన్ – భద్రకాళి నాటకం
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ స్క్రిప్ట్ – ఓబుర్
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ సినిమాటోగ్రఫీ – లైవ్ ఇన్ లూమ్
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డైరెక్షన్ – ఆనంద్ రాయ్ (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డాక్యుమెంటరీ – రామ్ నమీ
స్పెషల్ మెన్షన్ – మేయళగన్ (తమిళం)
స్పెషల్ మెన్షన్ – తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్ (ధనుష్)




