Rashmi Gautam:జబర్దస్త్ ఈ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టీవీ టీఆర్పీలను షేక్ చేసేసిన షో. అయితే కాలక్రమేణా ఈ కామెడీ షో నుంచి ఒక్కొక్క కమెడియన్ వెళ్లిపోవడంతో జబర్దస్త్ అనే షోకి డిమాండ్ తగ్గిపోయింది. ఒకప్పుడు టీవీలకు అతుక్కుపోయి చూసే జనాలు.. ఇప్పుడు జబర్దస్త్ అంటే ‘అమ్మో.. వల్గర్ పంచులు, దారుణమైన డైలాగులు బాబు’ అనే పరిస్థితి తయారైంది. అయితే ఆ పేరు నుంచి మళ్లీ ‘జబర్దస్త్ అంటే కడుపుబ్బ నవ్వుకోవచ్చు.. కామెడీ ఉంటుంది’ అనే పేరును తీసుకురావడానికి జబర్దస్త్ టీం బాగా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే షోని ఒక్కొక్కరుగా వీడిన కమెడియన్లను తిరిగి తీసుకొస్తుంది. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ బ్యాక్ వచ్చారు.
జబర్దస్త్‌లో సుధీర్ ఎంట్రీ :
తాజాగా సుధీర్ ఈ షోలో మెరిశారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ ప్రోమో వైరల్‌గా మారింది. సుధీర్‌ను చూడగానే రష్మి(Rashmi Gautam) ముఖం వెలిగిపోయింది. మొదటి నుంచి సుధీర్, రష్మిల మధ్య ఏదో ఉంది.. ఏదో జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టే సుధీర్‌ను చూడగానే రష్మి ముఖం వెలిగిపోవడం.. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. హైపర్ ఆదితో కలిసి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు.
సుధీర్‌ను తన పక్కకు రమ్మని రష్మి పిలిచింది. ‘కొంచెం అటువెళ్లు.. అంటూ ఇక్కడ కూడా నా ప్లేస్ తీసేసుకుంటావా?’ అంటూ రష్మి సెటైర్ వేసింది. దీంతో వెంటనే సుధీర్ ‘ఇద్దరి ప్లేస్ వేరే వేరే’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి.
also read:Balakrishna:కొడుకు బర్త్‌డేకు సెన్సేషనల్ గిఫ్ట్ రెడీ చేసిన బాలయ్య..!
రష్మి పెళ్లి ప్రశ్నకు సుధీర్ కౌంటర్ :
అంతేకాదు.. హైపర్ ఆది అడిగే ప్రశ్నకు సుధీర్ తనదైన స్టైల్‌లో అనుసరిస్తూ ఫన్ క్రియేట్ చేయడం హ్యాపీగా నవ్వుకునేలా జనాలను చేసింది. ‘నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు?’ అని రష్మిని అడుగుతాడు. దీంతో వెంటనే రష్మి.. ‘నేను ముత్యం లాంటి దానిని కదా.. నన్ను కాపాడే ఆల్చిప్ప లాంటివాడు కావాలి’ అని చెబుతుంది. వెంటనే కౌంటర్ ఇస్తూ.. ‘మోకాలు చిప్పలేవు గానీ ఆల్చిప్పలు కావాలంట’ అంటూ సుధీర్ కౌంటర్ వేయడంతో రష్మి గోల గోల చేస్తుంది.
also read:Allu Arjun:పుష్పలో లేడీ గెటప్ వెనుక ఇంత కథ ఉందా? బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎమోషనల్‌గా మారిన రష్మి :
ఆ తర్వాత గెటప్ శ్రీను కూడా వెరైటీ గెటప్‌తో కడుపుబ్బ నవ్విస్తాడు. ప్రోమో కట్ చేసే ముందు రష్మి, సుధీర్‌తో తన బాండింగ్ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది. ‘ఇద్దరం ఒకేసారి ఒకే స్టేజ్‌పైకి వచ్చాము. కానీ సుధీర్ వెళ్లిపోయాడు’ అని చెబుతూ రష్మి కంటతడి పెడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సుధీర్, రష్మిల బాండింగ్ మళ్లీ జబర్దస్త్‌ను ముందుకు తీసుకెళ్తుందా? లేదా కేవలం ఒక్క ఎపిసోడ్‌కి సుధీర్ గెస్ట్‌గా వచ్చాడా? అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ ఈ జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.




