Monday, October 12, 2026
HomeLATESTBigg Boss:బిగ్‌బాస్ లో సంచలనం.. రెడ్ కార్డ్‌తో కామనర్ ఎలిమినేషన్!

Bigg Boss:బిగ్‌బాస్ లో సంచలనం.. రెడ్ కార్డ్‌తో కామనర్ ఎలిమినేషన్!

Bigg Boss: కామన్‌మేన్‌ కేటగిరీలో హౌస్‌లోకి అడుగుపెట్టిన మంజునాథ్‌ తోటి కంటెస్టెంట్లు యష్‌, సౌందర్యలను ఉద్దేశించి అతడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు. మహిళా కంటెస్టెంట్‌ను వ్యక్తిగతంగా అవమానించే విధంగా అతడు చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

on
- Advertisement -banner Ad

Bigg Boss:బిగ్‌బాస్ కన్నడ సీజన్ 13లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. హౌస్‌లో తోటి మహిళా కంటెస్టెంట్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన మంజునాథ్‌ (మంజ)పై బిగ్‌బాస్ కఠిన చర్యలు తీసుకున్నారు. అతడికి రెడ్ కార్డ్ చూపించి షో నుంచి బయటకు పంపించారు. ఐదు వారాలుగా కంటెస్టెంట్‌గా కొనసాగిన మంజ ప్రయాణం ఇలా అనూహ్యంగా ముగియడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

మహిళా కంటెస్టెంట్లపై అనుచిత వ్యాఖ్యలు :

బిగ్‌బాస్(Bigg Boss) కన్నడ 13వ సీజన్‌లో కామన్‌మేన్‌ కేటగిరీలో హౌస్‌లోకి అడుగుపెట్టిన మంజునాథ్‌ మొదటి నుంచీ తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. అయితే, ఇటీవల జరిగిన టాస్క్‌ల సమయంలో అతడి ప్రవర్తన మరింత వివాదాస్పదంగా మారింది. తోటి కంటెస్టెంట్లు యష్‌, సౌందర్యలను ఉద్దేశించి అతడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు. మహిళా కంటెస్టెంట్‌ను వ్యక్తిగతంగా అవమానించే విధంగా అతడు చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
Advertisement

అతడు ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరంగా ఉండటంతో ఎపిసోడ్ ప్రసార సమయంలో కొన్ని మాటలను బీప్ చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజ ప్రవర్తనను తప్పుబడుతూ, అతడిని వెంటనే షో నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ చేశారు.

కిచ్చా సుదీప్‌ తీవ్ర హెచ్చరిక :

ఈ వివాదంపై వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ కిచ్చా సుదీప్‌ స్పందించారు. మహిళా కంటెస్టెంట్‌ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హౌస్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హద్దులు దాటి ప్రవర్తించడం సమర్థనీయం కాదనే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోకపోవడంపై కూడా మంజను ప్రశ్నించారు.

- Advertisement -
Advertisement

also read:Karan Johar:కరణ్ జోహార్ కొత్త బిజినెస్ ప్లాన్.. ఈసారి లెక్కే వేరు!

తల్లి మాటలతో భావోద్వేగానికి గురైన మంజ :

వివాదం తీవ్రం కావడంతో మంజను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్‌బాస్‌.. అతడు గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ను వినిపించారు. తన వ్యాఖ్యలను మరోసారి విన్న మంజ భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం తన తల్లితో మాట్లాడే అవకాశం కల్పించగా, ఆమె కూడా అతడి ప్రవర్తనను తప్పుబట్టారు. దీంతో మంజ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

- Advertisement -
Advertisement

also read:Balakrishna:రోడ్డు విస్తరణ కోసం ఇంటి స్థలం త్యాగం.. బాలకృష్ణ నిర్ణయంపై చర్చ!

పుట్టినరోజునే షో నుంచి బయటకు :

తన తప్పును అంగీకరిస్తూ మంజ క్షమాపణలు కోరినప్పటికీ, అతడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళా కంటెస్టెంట్ల పట్ల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన బిగ్‌బాస్‌ రెడ్ కార్డ్ ద్వారా అతడిని ఎలిమినేట్ చేశారు. అక్టోబర్ 11న తన పుట్టినరోజు నాడే మంజకు ఈ పరిణామం ఎదురైంది.

దీంతో ఐదు వారాలుగా సాగిన అతడి బిగ్‌బాస్ ప్రయాణం అర్ధంతరంగా ముగిసింది. తన ఆటతీరుతో కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తన కారణంగా మంజ షో నుంచి నిష్క్రమించాల్సి రావడం ప్రేక్షకుల్లో చర్చకు దారితీసింది. ఈ ఘటన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవర్తనా నియమాలు, తోటి కంటెస్టెంట్ల పట్ల గౌరవం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you