Dhurandhar:బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన రణవీర్ సింగ్ కెరియర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో ధురంధర్ కూడా ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. అలాగే ధురంధర్ 2 సినిమా కూడా విడుదలై భారీ విజయాన్ని అందుకోగా.. ఈ రెండు చిత్రాలు కలిపి సుమారుగా రూ. 3,100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఈ చిత్రాన్ని జూలై 10వ తేదీన జపాన్లో విడుదల చేశారు. అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఈ సినిమా ప్రేక్షక ఆదరణ అందుకోలేకపోతున్నట్లు వినిపిస్తోంది.
ధురంధర్ అక్కడ ఎదురుదెబ్బ?
భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రంగా జపాన్లో సుమారుగా 80 స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్గా విడుదల చేశారు. ముఖ్యంగా ఈ సినిమాని భారీగా ప్రమోషన్ చేశారు. అయితే అక్కడ అందుతున్న కొన్ని నివేదికల ప్రకారం.. శుక్ర, శని ఆదివారాలలో జపాన్ లోని టాప్ 25 చిత్రాలలో ఈ సినిమా స్థానం సంపాదించుకోలేకపోయినట్లు తెలుస్తోంది. విడుదలైన మొదటి రోజే మధ్యాహ్నం 2 గంటల వరకు 57 థియేటర్లలో కేవలం ఈ సినిమాకి 449 మంది ప్రేక్షకులు మాత్రమే వచ్చారని, రెండవ రోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో కలెక్షన్స్ కనిపించలేదు.
ALSO READ:Keerthy Suresh:చీరలో నిండుగా సాంప్రదాయంగా ఆకట్టుకున్న మహానటి.. ఫొటోస్ వైరల్!
మరీ ఇంత చెత్త రికార్డు?
మొదటిరోజు జపాన్లో 80 స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని విడుదల చేయగా.. 900 మంది ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. ఓవరాల్ గా తొలి మూడు రోజులలో జపాన్ లోని టాప్ 25 సినిమాల లిస్టులో ధురంధర్ (Dhurandhar) సినిమాకి చోటు దక్కలేకపోవడంతో ఇదొక చెత్త రికార్డుగా నమోదవుతుంది. ఇప్పటివరకు జపాన్లో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 చిత్రం 1300 టికెట్లతో చివరి స్థానంలో ఉన్నది. పుష్ప 2 చిత్రం 886 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
ALSO READ:Shruti Haasan:కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. ఫొటోస్ వైరల్
భవిష్యత్తులో మారుతుందా?
ఇప్పుడు తాజాగా ధురంధర్ చిత్రానికి 900 టికెట్స్ మాత్రమే బుక్ అవ్వగా జపాన్లు విడుదలైన మొదటి రోజే 8230 టికెట్లతో RRR సినిమా అతిపెద్ద ఇండియన్ ఓపెనర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత సాహో, కల్కి, పఠాన్, సలార్, రంగస్థలం, జవాన్, దేవర, బాహుబలి 2, టైగర్ 3 వంటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఏది ఏమైనాప్పటికీ రూ.3 వేల కోట్ల రూపాయలు సాధించిన దురంధర్ సినిమా జపాన్లో కలెక్షన్లు రాకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజుల్లోనైనా జపాన్లో ఈ సినిమాకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుందో లేదో చూడాలి మరి.




