Wednesday, July 15, 2026
HomeLATESTShruti Haasan:కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. ఫొటోస్ వైరల్

Shruti Haasan:కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. ఫొటోస్ వైరల్

Shruti Haasan: ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ రాజాగా గృహప్రవేశ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

on
- Advertisement -banner Ad

Shruti Haasan:టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ,, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో నటించిన శృతిహాసన్ ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూ మంచి విజయాలను అందుకుంటోంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా శృతిహాసన్(Shruti Haasan) జీవితంలో మరో సరికొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో ఒక కొత్త లగ్జరీ ఇల్లును నిర్మించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్..

ఆ ఇంటి గృహప్రవేశానికి సంబంధించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజ చేయిస్తున్న శృతిహాసన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అత్యంత తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో శృతిహాసన్ తమ గృహప్రవేశ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. శృతిహాసన్ పూజా సమయంలో సాంప్రదాయమైన దుస్తులలో కనిపించి అందరిని ఆకట్టుకుంది. పూజా మందిరంలో నేలపై కూర్చొని మరీ ప్రత్యేకమైన హోమాలు, పూజా విధానాలు పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని పనులను స్వయంగా శృతిహాసన్ దగ్గరుండి మరీ నిర్వహించినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:OTT movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్ లివే!

గృహప్రవేశం ఆనందంతో పాటు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది..

శృతిహాసన్ జీవితంలో ఈ నూతన గృహం ఎంతో ఆనందాన్ని మానసిక బలాన్ని ఇస్తుంది అంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముంబైలో కూడా శృతిహాసన్ కి ఒక ఇల్లు కలదు. కుటుంబ సభ్యులు సినిమా షూటింగ్ సమయాలలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చెన్నైలో ఈ ఇల్లు కొనుక్కున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న అటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సైతం శృతిహాసన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Korean kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్..

శృతిహాసన్ పర్సనల్ లైఫ్..

శృతిహాసన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇప్పటికే రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్ అవ్వడంతో తన జీవితంలో ఇక ప్రేమ అనే పదానికి స్థానం ఉండదంటూ తెలియజేసింది. గతంలో కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. కానీ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టానని , అందుకే తన దగ్గరకు వచ్చిన ప్రతిపాత్రను కూడా చేస్తూ పేరు సంపాదిస్తోంది శృతిహాసన్. ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. 2025లో కూలీ సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత ఈ ఏడాది పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you