Shiva Nirvana:మాస్ హీరో రవితేజ ఇటీవల నటించిన చిత్రం ఇరుముడి. ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ సోమవారం రోజున చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు చిత్ర బృందం. ఇందులో ఇరుముడి టీం తో పాటూ నిర్మాతలు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఇరుముడి సినిమాలో నటించిన బేబీ నక్షత్ర పైన డైరెక్టర్ శివ(Shiva Nirvana) ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ఆమె చూపించిన ధైర్యం , అంకితభావం , ఎమోషనల్ సీన్స్ పైన ప్రశంసలు కురిపించారు.
బేబీ నక్షత్రపై డైరెక్టర్ ప్రశంసలు..
అంతేకాకుండా నక్షత్రకి సంబంధించి ఒక విషయాన్ని తన పర్మిషన్ తీసుకొని మరి తెలియజేశారు.. నక్షత్ర మదర్, అంకుల్ని వేదిక పైన ఆహ్వానిస్తూ.. సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలని, ధైర్యంగా పెంచాలని చెబుతూ ఉంటారు. అయితే నక్షత్రా లాంటి ధైర్యం గట్టి గుండె ఉన్న చిన్నారిని తాను ఎక్కడా చూడలేదంటూ ప్రశంసలు కురిపించారు. తాను ఇప్పుడు చెప్పే విషయాన్ని నక్షత్ర అనుమతి తీసుకుని వెల్లడిస్తానని.. షూటింగ్ ప్రారంభించినప్పుడు నక్షత్రకు తెలుగు విషయంలో చాలా కాన్షియస్ గా ఉండేదని తెలియజేశారు శివ.
ALSO READ:TV:మంగళవారం సినిమా ట్రీట్.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అదిరిపోయే మూవీస్!
నక్షత్రకి తండ్రి లేడు..
తప్పులు వస్తాయేమో అని చాలా భయపడేది . అందుకే తెలుగు, మలయాళం రెండు తెలిసిన ఒక అసిస్టెంట్ ని నక్షత్రతో ఉంచి ప్రతి విషయాన్ని రెండు భాషలలో వివరించేలా చేశామని తెలిపారు. నక్షత్ర చిన్నచిన్నగా తెలుగు నేర్చుకుని ఆ తర్వాత సులభంగా డైలాగులు చెప్పడం ప్రారంభించిందని, అయితే కామెడీ సీన్స్ , పాటలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఎమోషనల్ సీన్ వచ్చిందని తెలిపారు. అయితే అది తన తండ్రికి సంబంధించిన విషయమని చాలా ఎమోషనల్ సీన్ అని వివరించాము. ఆ సీన్ లో నక్షత్రకు కొన్ని సూచనలు ఇచ్చి మీ ఫాదర్ ను ఊహించుకొని చేయి అని చెప్పానని తెలిపారు.
ALSO READ:Srushti Varma:”న్యాయం చేయరా దేవుడా”.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్!
ఆమె నటన అద్భుతం..
అందుకు నక్షత్ర నాకు తండ్రి లేరు అని చెప్పడంతో చాలా బాధేసింది. అప్పటికే నక్షత్ర రెండు మూడు ఎమోషన్స్ సీన్స్ లలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. తాను మరింత ఎమోషనల్ అయితే నక్షత్రకు తండ్రి గుర్తుకు వస్తారేమో అని భావించి.. పర్లేదు సిచువేషన్ ను ఇమేజినేషన్ చేసి ..నువ్వు ఎంత ఎమోషన్ తీసుకు రాగలవో అంతే తీసుకురా అని చెప్పానని తెలిపారు. సినిమా క్లైమాక్స్లో నక్షత్ర చాలా అద్భుతంగా నటించింది అని, చివరి 20 నిమిషాలలో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు తెలియదని.. ఆ సీన్స్ అన్ని కూడా ఇలాంటి చిన్న అమ్మాయి చేసిందని తెలియజేశారు. కొన్ని విషయాలలో మరోసారి టేక్ తీసుకోండి సార్ అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానంటూ నక్షత్ర గురించి ఎమోషనల్ గా మాట్లాడారు డైరెక్టర్ శివ.




