Wednesday, October 14, 2026
HomeLATESTEmran Hashmi:తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఇమ్రాన్ హష్మీ.!

Emran Hashmi:తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఇమ్రాన్ హష్మీ.!

Emran Hashmi: ఓజీ మూవీ నటుడు ఇమ్రాన్ హష్మీ తృటి లో ప్రమాదం తప్పించుకోవడంతో ఆయన అభిమానులు చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు

on
- Advertisement -banner Ad

Emran Hashmi:బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన పేరు ఇమ్రాన్ హష్మీ తన నటనతో స్టైలిష్ లుక్కుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇమ్రాన్ హష్మీ తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రంలో విలన్ గా నటించి అద్భుతమైన నటన కనపరిచారు. తాజాగా ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో ప్రమాదం తప్పింది అనే విధంగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. గన్ మాస్టర్ G9 సినిమా కోసం ఒక భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వినిపిస్తోంది.

తృటిలో తప్పిన ప్రమాదం..

అసలు విషయంలోకి వెళ్తే.. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో క్రేన్ కు వేలాడదీసిన ఎస్ యు వి వెహికల్ గాల్లో పల్టీలు కొడుతూ కింద పార్కు చేసి ఉన్న వ్యాన్ పైన పడింది. అయితే ఆ కార్ ఇమ్రాన్ హష్మీకి (Emran Hashmi) అత్యంత సమీపంలోకి వచ్చిందని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన పైన చిత్ర బృందం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కాని ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఈ విషయం విన్న అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

- Advertisement -
Advertisement

also read:Vishnu Priya:సోషల్ మీడియాలో విష్ణుప్రియ హవా.. సబ్‌స్క్రిప్షన్ల ఆదాయంపై చర్చ :

అప్రమత్తమైన చిత్ర బృందం..

వైరల్ గా మారుతున్న వీడియోలో.. ముందుగా చిత్ర బృందం యాక్షన్ సీన్ చిత్రీకరించడానికి ఒక కారుని క్రేన్ తో వేలాడదీశారు. కౌన్ డౌన్ చెప్పగానే క్రేన్ కు వేలాడదీసిన కారుని గాల్లో తిప్పుతూ తలకిందులుగా మారి కింద ఉన్న వ్యాన్ పై కప్పు పైన చాలా బలంగా పడింది. అయితే ఆ కారు మరో కారుకి అతి సమీపంలో హీరో ఇమ్రాన్ హష్మీ ప్రయాణిస్తున్న కారుకు దగ్గరగా వెళ్లినట్లు సమాచారం.. దీంతో చిత్ర బృందం వెంటనే అప్రమత్తం అవ్వడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

also read:Harish Shankar :విజయ్ దేవరకొండపై ట్రోలర్లకు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!

గన్ మాస్టర్ జి9 నవంబర్లో విడుదల..

ఈ చిత్రాన్ని ఆదిత్య దత్ దర్శకత్వంలో గన్ మాస్టర్ G9 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హస్మితో పాటుగా జెనీలియా, అపారశక్తి ఖురాన, అభిషేక్ సింగ్ తదితర నటీ నటులు కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆగస్టులో విడుదల చేసిన చిన్నపాటి గ్లింప్స్ సినిమా పైన అంచనాలను మరింత పెంచేసేలా చేసింది.. ఇందులో ఈశ్వర్ అనే ఒక డైరీ ఫార్మ్ యజమానిగా కనిపించబోతున్నారు ఇమ్రాన్ హష్మీ. ఇందులో తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ ఇమ్రాన్ హష్మీ ఇలా ప్రమాదం నుంచి బయటపడటంతో అటు చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you