Trisha Krishnan:తమిళనాడు సినీ రాజకీయ వేదిక పైన చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) జీవిత కథ ఆధారంగా వెండితెర పైన డాక్టర్ ఎంజీఆర్ అనే పేరుతో తెరకెక్కించబోతున్న చిత్రానికి సంబంధించి న్యూస్ కోలీవుడ్లో ఒక సంచలనంగా మారింది.. ఎంజీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన వారిలో దివంగత నేత జయలలిత పాత్ర కోసం హీరోయిన్ త్రిష ను చిత్ర బృందం సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దర్శక ,నిర్మాత, నటుడు జేఎం బషీర్ స్వయంగా తెలియజేశారు.
తెరపైకి ఎంజీఆర్ జీవిత చరిత్ర..
గతంలో పసుంపోన్ దేవర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న జేఎం బషీర్ ఎంజీఆర్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో బషీర్ మాట్లాడుతూ.. ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన జీవితంతో ముడిపడి ఉన్న జయ లలిత పాత్ర చాలా కీలకమని స్పష్టం చేశారు.. జయలలిత గారి వ్యక్తిత్వం ,హుందాతనాన్ని తెరపైన చూపించడాన్ని త్రిష (Trisha Krishnan)అయితే అన్ని విధాలుగా న్యాయం చేయగలరని తాను భావిస్తున్నానని, ఆమెనుఈ ప్రాజెక్టు కోసం సంప్రదిస్తున్నామని పైగా నా కుమార్తె , త్రిష మంచి స్నేహితురాలు.. వారిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటిస్తున్నారని తెలిపారు బషీర్.
త్రిష జయలలిత పాత్రకు ఒప్పుకుంటుందా?
ఒకవేళ త్రిష ఈ ప్రాజెక్టులో చేస్తే ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూరుతుందని బషీర్ పేర్కొన్నారు .ఈ చారిత్రక పాత్రను పోషించేందుకు త్రిష అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతోంది ఒకవేళ ఈ పాత్రకు త్రిష అంగీకరిస్తే ఆమె కెరియర్ లోనే ఈ సినిమా మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ బయోపిక్ లో కేవలం ఎంజీఆర్ వెండితెర విజయాలనే కాకుండా ఆయన బాల్యం, యవ్వనం, పేదరికం నుంచి ఎలా ఎదిగారు.. రాజకీయాలలో ఎలా చక్రం తిప్పగలిగారు అనే విషయాన్ని చూపించబోతున్నారు.
also read:Emran Hashmi:తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ ఇమ్రాన్ హష్మీ.!
అక్టోబర్ 17 నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం..
తమిళ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన మాజీ ముఖ్యమంత్రులలో సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి పాత్రలు కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు బషీర్ తెలిపారు. ఆయా దిగ్గజ పాత్రలకు సరిపోయే నటులను ప్రస్తుతం ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నాయని, రామనాథపురంలో అక్టోబర్ 17 నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నామని చిత్రానికి పనిచేయబోతున్న దర్శకుడు, సంగీత దర్శకుడు పేర్లను కూడా అధికారికంగా త్వరలోనే తెలియజేయబోతున్నామని బషీర్ తెలిపారు.
also read:Vishnu Priya:సోషల్ మీడియాలో విష్ణుప్రియ హవా.. సబ్స్క్రిప్షన్ల ఆదాయంపై చర్చ :
ఎంజీఆర్ బయోపిక్..
అలాగే రాజకీయ వివాదాల పైన కూడా స్పందిస్తూ.. తాను గతంలో అన్నాడీఎంకే, డీఎంకే లలో కూడా పనిచేశానని, ప్రస్తుతం విజయ్ సారధ్యంలోనే టీవీకే పార్టీలో ఉన్నానని, ఎంజీఆర్ చరిత్రను నిష్పక్షపాతంగా, ఆయన ఔన్నత్వాన్ని చాటి చూపించేలా తెరకెక్కించడమే తన లక్ష్యమని ఎందుకు ఎవరి నుంచి అడ్డంకులు కూడా ఉండవని బషీర్ తెలిపారు. ప్రస్తుతం జయలలిత పాత్రలో త్రిష నటిస్తారనే వార్తలు రావడంతో ఈ బయోపిక్ పైన మరొకసారి భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.




