Wednesday, September 2, 2026
HomeLATESTPawan Kalyan:పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా. ?

Pawan Kalyan:పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా. ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి లోపల.

on
- Advertisement -banner Ad

Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో.. మెగా అభిమానులు సైతం థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తూ ఉండడమే కాకుండా పలు రకాల సేవ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, నేతలు కూడా పలు రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు రాజకీయాలు, మరొకవైపు డిప్యూటీ సీఎం గా తన బాధ్యతను చేపడుతూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం చేత అభిమానులు కూడా తమ తదుపరి సినిమాల అప్డేట్ల కోసం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

సహనిర్మాతగా పనిచేసిన పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నయ్య చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఉన్నది అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా పవర్ స్టార్ అనే బిరుదు కలదు.. 2024 ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కావడంలో పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించారని అభిమానులు చెబుతూ ఉంటారు. సినిమాలలోకి రాకముందు పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ కుమార్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.అంజన ప్రొడక్షన్ నుంచి ఎన్నో చిత్రాలకు సహనిర్మాతగా కూడా వ్యవహరించారు పవన్ కళ్యాణ్.

- Advertisement -
Advertisement

also read:Kayadu Lohar: లంగా వోణీలో చందమామలా ఆకట్టుకుంటున్న కయాదు లోహర్.. పిక్స్ వైరల్!

కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ గా..

1996లో ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో గీత ఆర్ట్స్ బ్యానర్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించి పవర్ స్టార్ గా ఎదిగారు. మెగా కుటుంబం మొత్తం రామ భక్త హనుమాన్ స్వామికి భక్తులు.. అన్నయ్య ఆంజనేయ స్వామి పేరుని కలిసి వచ్చేలా చిరంజీవిగా పేరు పెట్టుకొని మెగాస్టార్ గా ఎదిగారు. ఇక అదే రూట్ లోనే కళ్యాణ్ బాబు కూడా అంజన పుత్రుడి పేరు కలిసి వచ్చేలా.. తన పేరుకి ముందు పవన్ చేర్చుకొని పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్ళేది వీరే!

పవర్ స్టార్ బిరుదు వెనుక అసలు నిజం..

దీంతో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన గోకులంలో సీత అనే సినిమా టైటిల్ లో కూడా పవన్ కళ్యాణ్ అని వేయడం జరిగింది. ఈ చిత్రానికి పోసాని కృష్ణ మురళి మాటలు అందించారు.. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పోసాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను పవర్ స్టార్ అని పిలుస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత పలు రకాల పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అనే పేరుతో స్టోరీలు రాయడంతో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారింది. సుస్వాగతం సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు మొదటిసారి కనిపించింది. ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన సినీ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you