Thursday, July 23, 2026
HomeLATESTBalakrishna:బాలయ్య ఆరోగ్యంపై ఏఐజి ఆసుపత్రి హెల్త్ బులిటెన్..

Balakrishna:బాలయ్య ఆరోగ్యంపై ఏఐజి ఆసుపత్రి హెల్త్ బులిటెన్..

Balakrishna: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Balakrishna:టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒకవైపు రాజకీయాలు.. మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ వయసులో కూడా బాలయ్య విభిన్నమైన కథలతో అందరిని అబ్బురపరుస్తున్నారు. నిన్నటి రోజున బాలయ్య సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తు పడిపోయారని, దీంతో బాలయ్య కాలికి పెద్ద గాయం అయ్యిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా తెలియజేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో ఆయన ఎడమ కాలికి తీవ్రమైన గాయం అయ్యిందని, వెంటనే చిత్ర బృందం హుటాహుటిగా బాలయ్యను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలుస్తోంది.

బాలయ్య ఆరోగ్యం పై హెల్త్ బులెటిన్..

దీంతో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక పరీక్షల కోసం బాలకృష్ణను (Balakrishna)హెయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ లో ఏఐజి ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఏఐజి ఆసుపత్రి వైద్యం బాలయ్య ఆరోగ్య పరిస్థితి పైన అధికారికంగా హెల్త్ బులెటిన్ ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి వర్గాలు తెలిపిన ప్రకారం.. బాలయ్య ఎడమ మోకాలి పరిస్థితి పైన ప్రాథమిక పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:The Odyssey:’ది ఒడిస్సీ’లో నటించే అదృష్టం.. చేతుల్లారా మిస్ చేసుకున్న మన స్టార్ హీరో ఇతడే!?

వైద్యులు ఏమన్నారంటే?

బాలయ్య ఎడమ మోకాలు చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డ కట్టింద,ని దీంతో తీవ్రమైన వాపు వచ్చినట్లు పరీక్షలలో తేలింది. ఇది మజిల్ టేర్ ను సూచిస్తోందంటూ వైద్యులు సైతం తెలియజేశారు. దీంతో ప్రముఖ ఆర్థో పెడిక్ సర్జన్ల బృంద పర్యవేక్షణలో విస్తృతమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలయ్య గత వైద్య చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సురక్షితమైన చికిత్సను అందించడానికి వైద్యులు సైతం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే బాలయ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Rajamouli:రాజమౌళి ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి పేరు ఏంటో తెలుసా?

పూర్తి వివరాలు త్వరలో..

ప్రస్తుతం బాలయ్యకు డయాగ్నస్టిక్ పరీక్షల నిర్వహించారని అనంతరం పరీక్షల నివేదికలన్నీ వచ్చిన తర్వాతే బాలయ్యకు తుది చికిత్స కోసం ముందుకు వెళ్లేలా చూస్తున్నారు వైద్యులు. తదుపరి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తామంటూ ఏఐజి ఆసుపత్రి వర్గాల నుంచి తెలియజేశారు. ఇప్పటికే బాలయ్య ఆరోగ్య విషయం పైన చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు సైతం స్పందిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you