లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శివాని నాగారం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
ఇందులో కాత్యాయని పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత తన పేరును కాత్యాయనిగా మార్చుకుంటాను అని కూడా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
ఇక తర్వాత సుహాస్ తో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మళ్లీ అదే సుహాస్ తో హే బల్వంత్ అనే సినిమా చేసి ప్రేక్షకులను అలరించింది.
ఈ చిత్రానికి హే భగవంత్ అనే టైటిల్ ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల టైటిల్ మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఈమె.. తాజాగా మెరూన్ కలర్ కాటన్ చీర కట్టుకొని బీచ్ సైడ్ నడుము అందాలను చూపిస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది.
తన అందాల సోయగాలతో మాయ చేసిన శివాని నాగారం తాజా ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.