Ranabali:టాలీవుడ్ క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించిన జంటలలో రష్మిక, విజయ్ దేవరకొండ జంట కూడా ఒకటి. ఈ ఏడాది వివాహ బంధంతో ఒకటైన ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం రణబాలి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం పైన ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమా అంచనాలను పెంచేశాయి. మొదట ఈ సినిమాని సెప్టెంబర్ 11న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.
రణబాలి వాయిదా పడనుందా?
కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదని, దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. అయితే సినిమా నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే సరికొత్త తేదీని పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ పాలన అణిచివేత నడుమ సాగేటువంటి సినిమా కథనే రణబాలి. 1854 నుండి 1878 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ALSO READ:OTT: ఊపిరి బిగపట్టే ట్విస్టులు..నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న థ్రిల్లర్!
జయమ్మ పాత్రలో రష్మిక..
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సంభవించిన కరువు, ఆంగ్లేయుల పన్నుల దోపిడీ వంటి అంశాలను ఇందులో చూపించబోతున్నారు. విజయ్ రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు. ఆ కాలంలో బ్రిటిష్ వారు ఇలాంటి యోధుల్ని నేరస్తులుగా చిత్రీకరించేవారు. కానీ ప్రజలు జానపద కథలలో మాత్రం హీరోలుగా వినిపించేవారు. రణబాలిలో జయమ్మ అనే బలమైన పాత్రలో (భార్యగా)రష్మిక నటిస్తోంది. ఇక నిజజీవితంలో కూడా రష్మిక విజయ్ దేవరకొండ భార్యగా మారిపోయింది.
ALSO READ:Rekha Vedavyas:బిగ్ బాస్ 10లోకి కుర్రాళ్ల గ్లామర్ క్రష్?..స్వయంగా స్పందించిన హీరోయిన్!
విజువల్ ఎమోషనల్ వండర్ గా రణబాలి..
రణబాలి(Ranabali) చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ను రంగంలోకి దించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని పలుభాషలలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ఒక గొప్ప విజువల్ అండ్ ఎమోషనల్ వండర్ గా ఉంటుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇదే కాకుండా విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.




