Thursday, July 23, 2026
HomeLATESTOTT: ఊపిరి బిగపట్టే ట్విస్టులు..నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న థ్రిల్లర్!

OTT: ఊపిరి బిగపట్టే ట్విస్టులు..నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న థ్రిల్లర్!

OTT:2012లో విడుదలై ప్రేక్షకులను అలరించిన హాలీవుడ్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం 'జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్' ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో మరోసారి ట్రెండింగ్ అవుతోంది.

on
- Advertisement -banner Ad

OTT:ఓటీటీ వేదికలపై పాత సినిమాలకు కూడా కొత్త జీవం లభిస్తుంది. థియేటర్లలో విడుదలై ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా ఆ చిత్రాలు ఇప్పుడు మళ్లీ ఓటీటీ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాంటి సినిమాలలో హాలీవుడ్ అడ్వెంచర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘జర్నీ 2: ది మిస్టీరియస్ ఐలాండ్’ ప్రస్తుతం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆసక్తికరమైన కథ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.

రహస్య ద్వీపం చుట్టూ తిరిగే ఆసక్తికర కథ :

ఈ సినిమా కథ సీన్ అండర్సన్ అనే యువకుడు చుట్టూ సాగుతుంది. ఒక రహస్య సంకేతాన్ని అందుకున్న అతడు తన సవతి తండ్రి హాంక్‌తో కలిసి దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లో మ్యాప్ లో కూడా కనిపించని ఒక ద్వీపానికి చేరుకుంటాడు. అక్కడ తన తాతని వెతికే ప్రయత్నం చేస్తాడు. అయితే అక్కడే అతడికి అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి. విచిత్రమైన జీవులు , ఊహించని ప్రమాదాలు, చివరకు ద్వీపం సముద్రంలో మునిగిపోయే పరిణామాలు కథను మరింత ఉత్కంఠ భరితంగా మారుస్తాయి.

- Advertisement -
Advertisement

స్టార్ నటీనటులతో ఆకట్టుకున్న చిత్రం:

ఈ చిత్రానికి బ్రాడ్ పేటన్ దర్శకత్వం వహించారు. ఇందులో డ్వేన్ జాన్సన్, మైఖేల్ కేన్, జోష్ హచర్సన్, వెనెస్సా హడ్జెన్స్, లూయిస్ గుజ్మాన్, క్రిస్టిన్ డేవిస్ కీలక పాత్రల్లో నటించారు. సుమారు 1 గంట 33 నిమిషాల నిడివి గల ఈ చిత్రం 2008లో వచ్చిన ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది.

ALSO READ:Rekha Vedavyas:బిగ్ బాస్ 10లోకి కుర్రాళ్ల గ్లామర్ క్రష్?..స్వయంగా స్పందించిన హీరోయిన్!

- Advertisement -
Advertisement

మళ్లీ ఓటీటీలో సెన్సేషన్ :

2012లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలు సాధించి విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఓటీటీలో మరోసారి ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది.

ALSO READ:OG:టీవీలోకి పవన్ కళ్యాణ్ ఓజీ..ఎందులో అంటే?

- Advertisement -
Advertisement

ఎక్కడ చూడొచ్చు:

ప్రస్తుతం జర్నీ టు మిస్టీరియస్ ఐలాండ్ ప్రముఖ ఓటీటీ(OTT) వేదిక నెట్ క్లీనింగ్ అవుతుంది ఇటీవల ఈ చిత్రం ప్లాట్ఫార్మ్లలో టాప్ 10 ట్రెండింగ్లలో జాబితాలు చోటుచేసుకుంది సస్పెన్స్ అడ్వెంచర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎంపిక అని చెప్పవచ్చు మొదటి నుంచి చివరికి వరకు ఆసక్తిగా నిలబెట్టే కథనం అద్భుతమైన విజువల్స్ వేగవంతమైన స్క్రీన్ పైతో ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అదరిస్తూనే ఉంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you