Friday, November 27, 2026
HomeLATESTNandi awards:నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. చైర్మన్గా బాలకృష్ణ..!

Nandi awards:నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. చైర్మన్గా బాలకృష్ణ..!

Nandi awards: గత ఎనిమిది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నంది అవార్డులను ఈ ఏడాది వచ్చే నెల ఘనంగా అందించనున్నారు.

on
- Advertisement -banner Ad

Nandi awards:తెలుగు సినీ పరిశ్రమలో, టెలివిజన్ రంగాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల గురించి గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ నిరీక్షణకు తాజాగా తెరపడినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి తాజాగా ఈ పురస్కారాలను అందించేందుకు అధికారికంగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్లో ఉన్న అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 2026 లో ఈ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేసింది . దీంతో సంబంధించి సినీ, టెలివిజన్ రంగాలలో మళ్లీ నంది అవార్డుల(Nandi awards) సందడి మొదలు కాబోతున్నట్లు కనిపిస్తోంది.

8 ఏళ్లకు కలిపి నంది అవార్డుల ప్రధానోత్సవం..

అయితే నంది అవార్డుల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 22న జీవో నెంబర్ 1834 ను జారీ చేసింది. దీని ప్రకారం 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది ఉత్తమ ఫీచర్ ఫిలిమ్, ఉత్తమ రెండో ఫీచర్ ఫిలిమ్ తో పాటు, రెండు ప్రత్యేకించి జూరీ అవార్డులను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా 8 ఏళ్లకు కలిపి ఒక్కో ఏడాదికి నాలుగు చొప్పున అవార్డులను అందించబోతోంది ఏపీ ప్రభుత్వం. అయితే 2025 ఏడాదికి గాను గతంలో మాదిరిగానే అన్ని ప్రధాన విభాగాలలో అవార్డులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

వచ్చేనెల ఘనంగా అవార్డు వేడుక..

నంది ఫిలిం అవార్డుల ప్రధానోత్సవాన్ని డిసెంబర్ 2026 లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈ అవార్డుల వేదికని విజయవాడ లేదా అమరావతి వేదికగా చేయబోతున్నట్లు సమాచారం. మరొకవైపు నంది టెలివిజన్ అవార్డుల సంబంధించి తిరుపతిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం. 2017 – 2024 సంవత్సరాలకు గాను విజేతల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి నవంబర్లో జాబితాని ప్రకటించారు. షెడ్యూల్ ని కూడా రూపొందించినట్లు తెలుస్తోంది . దీంతో ఏ చిత్రాలు ఏ ఏ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతాయో అనే విషయంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

also read:Rohit Naidu:రాంప్రసాద్ గుంట నక్క.. దెబ్జానీ ఫేక్జానీ.. రోహిత్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -
Advertisement

సినిమానే కాదు టెలివిజన్ రంగంలో కూడా..

టెలివిజన్ రంగానికి సంబంధించి 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది ఉత్తమ సీరియల్ , రెండో ఉత్తమ సీరియల్ తో పాటుగా రెండు ప్రత్యేకించి జ్యూరీ అవార్డులను అందించబోతున్నారు. 2017 నుంచి 2025 అవార్డులతో పాటుగా పెండింగ్లో ఉన్న పురస్కారాల పైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.. అలాగే 2012 నుంచి 2016 వరకు ప్రకటించిన నంది ఫిలిం, టీవీ అవార్డులను కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. తెలుగు సినిమా కళాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రారంభించారు.. మొదట్లో బంగారు , వెండి, కాంస్య నందుల రూపంలో ఉన్న అవార్డులను ఇచ్చేవారు. ఆ తర్వాత నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాలలో పురస్కారాలను ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు చేస్తున్నారు సెలబ్రిటీలు.

also read:Jabardasth Varsha:జబర్దస్త్ వర్ష జీవితంలో ఇన్ని విషాదాలా? కన్నీళ్లు పెట్టించే నిజాలు!

- Advertisement -
Advertisement

కమిటీ చైర్మన్గా బాలకృష్ణ..

దీనికి సంబంధించి కమిటీ చైర్మన్ గా నందమూరి బాలకృష్ణ ను నియమించగా.. సభ్యులుగా అల్లు అరవింద్ (నిర్మాత), ఎస్ గోపాల్ రెడ్డి (సినీ ప్రముఖులు), సీనియర్ నటి ప్రభను నియమిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you