Jaya Krishna:టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ బాబు అన్న కుమారుడు,కృష్ణ పెద్ద కుమారుడు అయినా రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని(Jaya Krishna) హీరోగా పరిచయం కాబోతున్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం తెరకెక్కిస్తూ ఉండడంతో సినిమా పైన అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంతోని ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం కాబోతోంది.
శ్రీనివాస మంగాపురం నుంచి ట్రైలర్ రిలీజ్..
అలాగే ఇందులో విలన్ గా మోహన్ బాబు నటిస్తూ ఉన్నారు. తాజాగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ ని విడుదల చేయగా.. సినిమా పైన అంచనాలను మరింత పెంచేసేలా కనిపిస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ చిత్రంలో ఎక్కువగా యాక్షన్, లవ్ బాగోద్వేగమైన సన్నివేశాలని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీను, మంగా మధ్య సాగే ప్రేమ కథలోకి బళ్ళారి రాజు వెంకటప్పయ్య నాయుడు ఎంట్రీ.. కథలో ప్రధాన అంశంగా చూపించారు డైరెక్టర్ అజయ్ భూపతి. డైరెక్టర్ అజయ్ భూపతి కూడా తనదైన శైలిలో ఈ సినిమా కథను చాలా పవర్ఫుల్ యాక్షన్ ఎమోషన్స్ తో తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
also read:Arya:హీరో ఆర్య పైన కేసు నమోదు!
ఆకట్టుకుంటున్న జయకృష్ణ నటన..
ముఖ్యంగా నటుడుగా జయ కృష్ణ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే హీరోయిన్ రాషా తడాని కూడా తన అందం , అభినయం ,నటనతో మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణంగా నిలిచింది. అలాగే మోహన్ బాబు విలన్ పాత్రలో మరొకసారి అదరగొట్టేసేలా కనిపిస్తున్నారు. తన డైలాగ్ డెలివరీతో ప్రత్యేకంగా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇప్పటికే ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. ఈనెల 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
also read:Rajinikanth:రజినీకాంత్‌పై ఉమ్మేసిన స్టార్ హీరోయిన్.. ఏళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ సీక్రెట్!
జయ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తారా?
మరి మొదటిసారి మహేష్ కుటుంబం నుంచి హీరోగా జయ కృష్ణ ఎంట్రీ ఇస్తుండడంతో అటు మహేష్ అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. మరి తన మొదటి సినిమాతోనే ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి మరి. ప్రస్తుతం ట్రైలర్ వైరల్ గా మారింది.




