Rashmika mandanna:టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించిన రష్మిక గత కొన్ని రోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.అందుకు కారణం మైసా సినిమా షూటింగ్ సమయంలో రష్మిక కాలికి గాయం అవ్వడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక తాజాగా హైదరాబాదులో ఒక ఎంగేజ్మెంట్ వేడుకలో తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి బహిరంగంగా కనిపించింది. ఈ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానులు కాస్త ఊరట పడుతున్నారు. అంతేకాదు ఈ వేడుకలో ఆమె కనిపించిన తీరు విజయ్ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
గాయం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన రష్మిక..
ప్రముఖ నిర్మాత ఎస్ నిరంజన్ రెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ ఆగస్టు 23న హైదరాబాదులో చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు కొంతమంది సినీ సెలబ్రిటీలు రావడం గమనార్హం . అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రష్మిక , విజయ్ దేవరకొండ జంట మాత్రమే. గడచిన కొన్ని నెలల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, ఇప్పుడు ఈ వేడుకకు జంటగా కలిసి రావడంతో అక్కడ మరింత సందడి పెరిగిపోయింది. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
also read:OTT MOVIES:ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే!
క్లాసిక్ లుక్ లో ఆకట్టుకున్న రష్మిక..
రష్మిక ఈ వేడుకలో నలుపు రంగు దుస్తులు ధరించగా, విజయ్ దేవరకొండ బ్లాక్ కుర్తాలో క్లాసిక్ లుక్ లో కనిపించారు. అలా కెమెరాల ముందు ఇద్దరూ ఎంతో రిలాక్స్డ్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా చికిత్స తీసుకున్న తర్వాత రష్మిక మరింత ఉత్సాహంగా కనిపించడం గమనార్హం. రష్మిక కుడి కాలు తుంటిలోని టెండన్ దెబ్బతిన్నట్లుగా స్వయంగా రష్మిక సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇది తనకు వరుసగా ఎదురైన మూడో గాయమని కూడా తెలియజేసింది. అయితే ఈ విషయం బయట చెప్పకూడదని భావించినప్పటికీ అభిమానులను దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నట్లు తెలిపింది.
also read:Mahakali Movie:మహాకాళి సినిమా నుంచి గ్లింప్స్ వైరల్!
రష్మిక కెరియర్ లో మైసా కీలకము..
ఆ గాయం నుంచి కోలుకోవడానికి శస్త్ర చికిత్స చేయించుకోవలసి వచ్చింది రష్మిక. గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్నది. రష్మిక కెరియర్ లోనే మైసా సినిమా గుర్తుండిపోయేలా ఉంటుంది. అత్యంత శారీరక శ్రమతో కూడిన ప్రాజెక్ట్ అన్నట్టుగా రష్మిక తెలిపింది. ఈ సినిమాలో గోండు గిరిజన మహిళగా కనిపించబోతోంది. ఇందులో యాక్షన్ పాత్రలు కూడా చాలానే ఉన్నాయి. రష్మిక గాయం కారణం చేత కొంతకాలం సినిమా షూటింగ్ కి దూరంగా ఉంది. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడం పైనే ఆమె దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమాలో నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈమె నటించిన హిందీ చిత్రం కాక్టెయిల్ 2 సినిమా కూడా విడుదలయ్యింది.
Couple Virosh #VijayDeverakonda & #RashmikaMandanna Snapped At Lawyer & Producer Niranjan Reddy’s Son’s Engagement In Hyderabad Last Night
Rashmika Made Her First Public Appearance After Her Leg Injury pic.twitter.com/6tHLUNNNUc
— Official Srinu (@OfficialSreeNu) August 24, 2026




