Wednesday, July 15, 2026
HomeLATEST‘RAW NTR’తో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎన్టీఆర్ ఆఫీస్ టీమ్ షాకింగ్ స్టేట్‌మెంట్..!

‘RAW NTR’తో మాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎన్టీఆర్ ఆఫీస్ టీమ్ షాకింగ్ స్టేట్‌మెంట్..!

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం, 'RAW NTR' పేరుతో వైరల్ అవుతున్న పోస్టర్లపై ఎన్టీఆర్ ఆఫీస్ అధికారికంగా స్పందించింది.

on
- Advertisement -banner Ad

RAW NTR:గత కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘RAW NTR’ అనే పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ నెల 18న తిరుపతిలో భారీ సమావేశం జరగనున్నట్లు పలు పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.

‘RAW NTR’తో తమకు సంబంధం లేదన్న కార్యాలయం:

అధికారిక ప్రకటనలో ‘RAW NTR’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థకు సంబంధించినదిగా ప్రజల్లో భావన కలిగించే ప్రయత్నం జరుగుతోందని కార్యాలయం పేర్కొంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఆ సంస్థతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదని స్పష్టం చేసింది. అలాగే, ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు కూడా లేదని, ఆయన పేరుతో కార్యక్రమాలు నిర్వహించే లేదా ప్రకటనలు చేసే అధికారం అంతకన్నా లేదని వెల్లడించింది.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న థ్రిల్లర్ సినిమా.. చివరి 20 నిమిషాలు మైండ్ బ్లాంక్..!

అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి:

జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు లేదా ఇతర కార్యకలాపాలపై సమాచారం ఆయన లేదా ఆయన అధికారిక బృందం ద్వారానే వెల్లడిస్తామని కార్యాలయం తెలిపింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు ప్రచారం చేసే సమాచారాన్ని అధికారికంగా పరిగణించవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
Advertisement

అపోహలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ టీమ్:

ఈ ప్రకటనతో ‘RAW NTR’ సంస్థకు సంబంధించి వస్తున్న అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. సాంప్రదాయ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే వివరాలనే విశ్వసించాలని కోరింది. అభిమానులు ఎప్పటిలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తూ, తమపై చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

- Advertisement -
Advertisement

ALSO READ:Manvitha Jagadeesh:మోడల్ నుంచి స్టార్ సీరియల్ హీరోయిన్‌గా.. బుల్లితెర క్వీన్ మన్విత జగదీశ్ సక్సెస్ స్టోరీ..!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you