Monday, August 31, 2026
HomeLATESTKorean Kanakaraju:వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. OTTలోకి హారర్ కామెడీ మూవీ..!

Korean Kanakaraju:వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. OTTలోకి హారర్ కామెడీ మూవీ..!

Korean Kanakaraju:వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ సెప్టెంబర్ 4 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది.

on
- Advertisement -banner Ad

Korean Kanakaraju:థియేటర్లలో పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా, కోట్ల భారీ బడ్జెట్‌తో అదిరిపోయే కాన్సెప్ట్‌తో సినిమాలు థియేటర్లలోకి ఎన్ని వచ్చినా, ఓటీటీలోకి ఏదైనా హిట్ మూవీ వస్తుంది అంటే చాలు జనాల హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో ఉంటుంది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలి అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాలి. అదే ఒక్కరికి పెట్టే టికెట్ డబ్బులతో ఇంట్లో ఖర్చుపెట్టి ఓటీటీలో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి టీవీ చూడొచ్చు అనే అభిప్రాయం కామన్ పీపుల్‌కి అందరికీ ఉంటుంది.

ఆ కారణంగానే ఓటీటీల హవా బాగా నడుస్తుంది. ఓటీటీలోకి ఏ సినిమా వస్తున్నా సరే, జనాలు మాత్రం భలే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి సినీ లవర్స్‌కు అదిరిపోయే సినిమాను ఓటీటీ తీసుకొచ్చేసింది. ఆ సినిమా మరేంటో కాదు.. ‘కొరియన్ కనకరాజు’.(Korean Kanakaraju) ఓటీటీలోకి ఈ సినిమా రాబోతుంది. దీంతో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:సోమవారం టీవీ మూవీస్: ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా?

వరుణ్ తేజ్‌కు హిట్ ఇచ్చిన కొరియన్ కనకరాజు:

గత కొంతకాలంగా హిట్లు లేకుండా అల్లాడిపోతున్న వరుణ్ తేజ్‌కి ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చిందనేది అందరికీ తెలిసిందే. ఒకపక్క కామెడీ, ఇంకొకపక్క హారర్.. రెండింటినీ మిక్స్ చేస్తూ మెగా ఎలిమెంట్స్‌ను హైలెట్ చేస్తూ వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement

థియేటర్‌కి వచ్చిన ప్రతి జనాలు ఈ సినిమాను చూసి కడుపారా నవ్వుకుని, హ్యాపీగా తిరిగి బయటికి వెళ్లారు. అంత చక్కగా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ‘ఇంత టాలెంట్ ఉండా’ అంటూ ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది అంటూ జనాలు రకరకాలుగా పొగిడేశారు.

ALSO READ:Adarsha kutumbam :వెంకీ మామ ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా..?

- Advertisement -
Advertisement

సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్:

ఆగస్టు 7న థియేటర్లలో రిలీజ్ అయిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సెప్టెంబర్ 4న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నారు. అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ కూడా అప్‌డేట్ ఇచ్చేసింది.

దీనితో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘కొరియన్ కనకరాజు’ సినిమా థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలో కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ నమ్మకం ఉంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you