Monday, August 31, 2026
HomeLATESTOTT Movies : ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. లిస్ట్ ఇదే!

OTT Movies : ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. లిస్ట్ ఇదే!

OTT Movies :ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

on
- Advertisement -banner Ad

OTT Movies :ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా వినోదానికి కొదవ ఉండదు. ధియేటర్స్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఓటీటీలోకి కొత్త సినిమా వస్తుంది అంటే చాలు జనాలు భలే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. దానికి ఎన్నెన్నో రీజన్స్ ఉన్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పలు భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. దీంతో సినీ లవర్స్ కి పడగనే చెప్పాలి. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, హారర్, డ్రామా, క్రైమ్ వంటి విభిన్న జానర్లలో వస్తున్న ఈ చిత్రాల్లో కొన్ని ఇప్పటికే థియేటర్లలో సందడి చేయగా.. మరికొన్ని ఓటీటీ(OTT Movies) ప్రేక్షకులను నేరుగా పలకరించనున్నాయి.

గాంధారి:

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’ ఈ వారం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెప్టెంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తన చిన్నారిని కోల్పోయిన తల్లి.. ఆమె కోసం చేసే పోరాటం చుట్టూ కథ సాగుతుంది. బాలల అక్రమ రవాణా ముఠా గురించి తెలుసుకున్న ఆమె తన బిడ్డను కాపాడేందుకు ఎదురొడ్డి నిలబడుతుంది. యాక్షన్‌తో పాటు తల్లీబిడ్డల భావోద్వేగాలను ఈ సినిమా చూపించనుంది.

- Advertisement -
Advertisement

లోకేష్ కనగరాజ్ ‘DC’:

దర్శకుడిగా భారీ యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్.. ‘DC’ సినిమాతో హీరోగా కనిపించారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, ఎమోషన్‌తో రూపొందిన ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూడొచ్చు.

ALSO READ:Korean Kanakaraju:వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. OTTలోకి హారర్ కామెడీ మూవీ..!

- Advertisement -
Advertisement

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’:

వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. థియేటర్ల తర్వాత డిజిటల్ ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెట్టేందుకు సిద్ధమైంది.

ALSO READ:TV:సోమవారం టీవీ మూవీస్: ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా?

- Advertisement -
Advertisement

ధమాల్ 4:

అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫరీ తదితరులు నటించిన బాలీవుడ్ కామెడీ మూవీ ‘ధమాల్ 4’ కూడా సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. భారీ నిధి కోసం జరిగే వేట నేపథ్యంలో సాగే ఈ సినిమా కామెడీ ప్రియులకు మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

ఇతర సినిమాలు:

‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కర్ణాటక సంగీతం, కుటుంబ వారసత్వం, ప్రేమ మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్రానికి ప్రధాన అంశం. అలాగే కుంచాకో బోబన్ నటించిన మలయాళ చిత్రం ‘ఉన్మాదం’ అదే రోజు సోనీలివ్‌లోకి రానుంది. మరోవైపు తమిళ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ది కోర్ట్’ సెప్టెంబర్ 4న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you