Sunday, July 12, 2026
HomeLATESTOTT: శాపం వెనుక దాగిన రహస్యం.. ఓటీటీల్లో దుమ్మురేపుతున్న 'త్రికాల'.. క్లైమాక్స్ వేరే లెవెల్..!

OTT: శాపం వెనుక దాగిన రహస్యం.. ఓటీటీల్లో దుమ్మురేపుతున్న ‘త్రికాల’.. క్లైమాక్స్ వేరే లెవెల్..!

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రద్ధా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మైథాలజికల్ డార్క్ థ్రిల్లర్ 'త్రికాల' ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్కంఠభరితమైన కథ, అద్భుతమైన విజువల్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

on
- Advertisement -banner Ad

OTT: తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకున్న మైథాలజికల్ డార్క్ థ్రిల్లర్ ‘త్రికాల'(trikala) ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఓటీటీ వేదికలపై కూడా అదే జోరును కొనసాగిస్తూ సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. విభిన్న కథాంశం, అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనం, స్వరూపమైన విచిత్రంతో ఈ చిత్రం ఓటీటీలో దుమ్ము దులిపేస్తోంది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ అందుకుంటోంది. ‘A Script of God’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఎంత మంచి స్పందన దక్కించుకుందో, దానికి ట్రిపుల్ రేంజ్‌లో ఓటీటీలో కూడా దుమ్ము దులిపేస్తోంది. డిజిటల్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

మూడు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్:

దాదాపు రెండు నెలల తర్వాత ఈ చిత్రం సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అక్కడ నుంచి మంచి స్పందన రావడంతో, కొద్దిరోజుల వ్యవధిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే జియోహాట్‌స్టార్ (OTT) వేదికల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఈ మూడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది ‘త్రికాల’. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు ఐఎండీబీలో కూడా మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి మంచి రేటింగ్ రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Advertisement

also read:S Janaki:ఇళయరాజా ట్యూన్‌కు ఎస్. జానకి కన్నీళ్లు.. ఆ పాట వెనుక హృదయాన్ని కదిలించే కథ..!

కర్మ సిద్ధాంతం నేపథ్యంలో ఆసక్తికర కథ:

దర్శకుడు మనీ తెల్లగూటి ఈ చిత్రాన్ని కర్మ సిద్ధాంతం, పునర్జన్మలు, గో సంరక్షణ వంటి అంశాలను మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీతో మేళవించి తెరకెక్కించారు. ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా ఆకట్టుకునేలా రూపొందించగా, పవన్ చెన్న సినిమాటోగ్రఫీ, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చి వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి.

- Advertisement -
Advertisement

also read:Lenin Movie:లెనిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

శాపం వెనుక దాగిన రహస్యమే కథలోని హైలైట్:

తరతరాలుగా ఒక రాజవంశాన్ని వెంటాడుతున్న శాపం చుట్టూ కథ సాగుతుంది. సూర్యకాంతిని చూడలేని వైతరణ జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలు, అతడికి చికిత్స అందించే సైకియాట్రిస్ట్ మాయ చేసిన అన్వేషణ, శంకరపల్లి గ్రామంలోని కాటేరమ్మ ఆలయ రహస్యం, పునర్జన్మలతో ముడిపడిన సంబంధాలు కథను ఉత్కంఠభరితంగా ముందుకు తీసుకెళ్తాయి. అజయ్, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్ర, ఆమని, ప్రభాకర్, రవివర్మ, రోహిణి తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. సస్పెన్స్, హారర్, మైథాలజీ కలయికలో రూపొందిన ఈ విభిన్నమైన సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ వీకెండ్‌లో ‘త్రికాల’ మంచి ఎంపికగా నిలుస్తుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you