Thursday, September 3, 2026
HomeLATESTRomanchakam Movie Review: కధ నిల్..కామెడీ ఫుల్..నవ్వులే నవ్వులు..!

Romanchakam Movie Review: కధ నిల్..కామెడీ ఫుల్..నవ్వులే నవ్వులు..!

Romanchakam Movie Review:సుమంత్ ప్రభాస్, అనంతిక శనిల్ కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ పూర్తి రివ్యూ ఇదే.

on
- Advertisement -banner Ad

Romanchakam Movie Review:యూత్‌ను టార్గెట్ చేస్తూ కామెడీ, లవ్, ఫ్రెండ్‌షిప్‌ అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక శనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించగా, సందీప్ రెడ్డి వంగా సమర్పకులుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? సుమంత్ ప్రభాస్‌కు మరో హిట్ దక్కిందా? నిర్మాతలుగా సందీప్ రెడ్డి వంగా సోదరులు సక్సెస్ అయ్యారా? చూద్దాం.

కథ :

అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఓ డేటింగ్ యాప్‌ను రూపొందించి దాని ద్వారా అబ్బాయిలు, అమ్మాయిలను కలిపే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే అతని ఆలోచనలను కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్దగా సీరియస్‌గా తీసుకోరు. ఈ క్రమంలో అతని డేటింగ్ యాప్ ద్వారా మైథిలి (అనంతిక శనిల్ కుమార్) పరిచయమవుతుంది.

- Advertisement -
Advertisement

మైథిలి అన్వేష్‌కు కొన్ని విచిత్రమైన పరీక్షలు పెడుతుంది. వాటన్నింటినీ దాటుకుంటూ ఆమెకు దగ్గరవుతాడు. పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. మైథిలి పుట్టినరోజున ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని అన్వేష్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తాడు. కానీ అక్కడ అతడికి ఊహించని అనుభవం ఎదురవుతుంది. అసలు మైథిలి ఎక్కడికి వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అన్వేష్ ఆమెను తిరిగి కలుసుకున్నాడా? వీరి ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘రోమాంచకం’ కథ.

also read:OG 2:ఓజి 2 పై అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ వైరల్..!

- Advertisement -
Advertisement

విశ్లేషణ :

‘రోమాంచకం(Romanchakam Movie Review)’ ప్రధానంగా కామెడీ, లవ్ ట్రాక్‌పై ఆధారపడిన సినిమా. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, కొన్ని సందర్భాల్లో దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు నవ్విస్తాయి. ముఖ్యంగా డైలాగ్ కామెడీ సినిమాకు బలంగా నిలిచింది.

అన్వేష్, అతని నలుగురు స్నేహితుల మధ్య జరిగే అల్లరి, సరదా సంభాషణలు మొదటి భాగంలో సినిమాను ముందుకు నడిపిస్తాయి. డేటింగ్ యాప్ ద్వారా మైథిలి పరిచయం కావడం, ఆమె పెట్టే పరీక్షలను హీరో ఎదుర్కోవడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి.

- Advertisement -
Advertisement

మైథిలి పుట్టినరోజు సందర్భంగా అన్వేష్ చెన్నై వెళ్లడం, అక్కడ అతడికి ఎదురయ్యే పరిణామాలు కథలో ఆసక్తిని పెంచుతాయి. అనంతరం మైథిలి హైదరాబాద్ వచ్చి అనూహ్యంగా కనిపించకుండా పోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఆమె కోసం అన్వేష్, అతని స్నేహితులు చేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల బాగా నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్‌లో వచ్చే పరిణామాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా చివర్లో వచ్చే సర్‌ప్రైజ్ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని కొంతవరకు మార్చేలా ఉంటుంది.

అయితే కథలో బలం తక్కువగా ఉండటం, సన్నివేశాల ఆధారంగానే సినిమాను నడిపించడం మైనస్‌గా మారింది. కొన్ని సందర్భాల్లో లాజిక్‌ను పక్కన పెట్టినట్లు అనిపిస్తుంది. లవ్ ట్రాక్ కూడా పూర్తిస్థాయిలో కనెక్ట్ చేయలేకపోయింది. హీరో హీరోయిన్ కోసం పడే తపన కూడా కొన్ని చోట్ల బలంగా అనిపించదు.

also read:Mamitha Baiju:ఆస్పత్రిలో చేరిన మమిత బైజు..!

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

సుమంత్ ప్రభాస్: అన్వేష్ పాత్రలో సుమంత్ ప్రభాస్ మెప్పించాడు. లుక్, బాడీ లాంగ్వేజ్, నటనలో గతంతో పోలిస్తే మెచ్యూరిటీ కనిపిస్తుంది.

అనంతిక శనిల్ కుమార్: మైథిలి పాత్రలో అనంతిక ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి.

నరేంద్ర: సినిమాకు పెద్ద ప్లస్ నరేంద్ర. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను బాగా నవ్వించాడు.

స్నేహితుల పాత్రల్లో నటించినవారు: హీరో ఫ్రెండ్స్‌గా నటించిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఉపేంద్ర: ఎస్‌ఐ పాత్రలో ఉపేంద్ర ఓకే అనిపించాడు. అయితే ఆయన పాత్ర నుంచి ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదు.

టెక్నికల్ టీమ్ :

వాసుకి వైభవ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొన్ని సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. విజువల్స్, ఫ్రేమింగ్‌లో మంచి ప్రయత్నం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి కథ కంటే కామెడీ, డైలాగ్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. కామెడీ డోస్‌ను నియంత్రించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.

ప్లస్ పాయింట్స్ :

*డైలాగ్ కామెడీ

*నరేంద్ర కామెడీ టైమింగ్

*సుమంత్ ప్రభాస్ నటన

*ఇంటర్వెల్ ట్విస్ట్

*క్లైమాక్స్

*సంగీతం, బీజీఎం

మైనస్ పాయింట్స్:

*బలమైన కథ లేకపోవడం

*కొన్ని లాజిక్ లెస్ సన్నివేశాలు

*లవ్ ట్రాక్ పూర్తిగా పండకపోవడం

*ఓవర్‌డోస్ కామెడీ

*ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం

ఫైనల్‌గా:

‘రోమాంచకం’లో పెద్దగా చెప్పుకోదగ్గ కథ లేకపోయినా, కామెడీ, డైలాగ్స్, ఫ్రెండ్‌షిప్ సన్నివేశాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నరేంద్ర కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లే యూత్‌కు కొన్ని సన్నివేశాలు బాగా నచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ‘రోమాంచకం’ ఓసారి సరదాగా చూడదగ్గ యూత్ కామెడీ ఎంటర్‌టైనర్.

పంచ్ లైన్ :

కథ కంటే కామెడీనే నమ్ముకున్న ‘రోమాంచకం’.. ఓసారి సరదాగా నవ్వించే యూత్ ఎంటర్‌టైనర్!

రేటింగ్: 2.5/ 5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you