Ravi Teja Irumudi:రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్‌పై రవితేజ ‘ఇరుముడి’ దూకుడు చూసి ట్రేడ్ వర్గాలే విస్మయానికి గురవుతున్నాయి. ఏదైనా సినిమా రోజులు గడిచేకొద్దీ కలెక్షన్స్ తగ్గుతాయి. కానీ రవితేజ నటించిన ‘ఇరుముడి’ మాత్రం రోజులు గడిచేకొద్దీ క్రమంగా కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి.
రెండో వారంలోకి ప్రవేశించినా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు.. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూడడానికి థియేటర్లకు పడిపోతున్నారు.
రెండో శుక్రవారం రూ.12 కోట్లకు పైగా గ్రాస్? :
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ‘ఇరుముడి’ సినిమా రెండో శుక్రవారం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఒక్క రోజులోనే రూ.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇదే రోజున ‘ఆర్ఆర్ఆర్’ సుమారు రూ.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో రవితేజ ‘ఇరుముడి’ ఆ రికార్డుకు కేవలం కొద్దిదూరంలోనే నిలిచింది. అదే సమయంలో మరెన్నో భారీ చిత్రాల రెండో శుక్రవారం వసూళ్లను ‘ఇరుముడి’ అధిగమించడం విశేషంగా మారింది.
also read:Actress: నెగిటివ్ పాత్రలకే మక్కువ చూపుతున్న సెలబ్రిటీస్..!
‘బాహుబలి 2’ రికార్డ్‌ను దాటేసిన ‘ఇరుముడి’ :
ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ రెండో శుక్రవారం బాక్సాఫీస్ వద్ద రూ.10.5 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇప్పుడు రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఆ మార్క్‌ను కూడా దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ రెండో శుక్రవారం దాదాపు రూ.9 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. ప్రభాస్ ‘కల్కి’ సుమారు రూ.7 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ భారీ చిత్రాల రెండో శుక్రవారం రికార్డులను అధిగమిస్తూ ‘ఇరుముడి’ సరికొత్త సంచలనాన్ని నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తున్న ‘ఇరుముడి(Ravi Teja Irumudi)’.. రెండో వారంలోనూ అదే జోరును కొనసాగిస్తూ స్టార్ హీరోల సినిమాల రికార్డులను టార్గెట్ చేస్తోంది. రవితేజ కెరీర్‌లోనే ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచేలా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.
also read:Samantha:మాతృత్వం పై సమంత కామెంట్స్..!
ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కారణమా?:
చిన్న సినిమా ఈ రేంజ్‌లో హిట్ కావడం నిజంగా చాలా చాలా గ్రేట్ అంటున్నారు జనాలు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకోవడం, ఎమోషన్స్ పుష్కలంగా ఉండడం, ఎక్కడా కూడా అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలు. ఇంకొక ప్రధాన కారణం రవితేజ నటన. నక్షత్ర యాక్టింగ్ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ‘ఇరుముడి’ సినిమా ఇంత పెద్ద సూపర్ సక్సెస్ అయింది.
రూ.200 కోట్లు కూడా దాటేస్తుందా? :
రూ.100 కోట్లు దాటితే చాలు రా బాబోయ్ అనుకున్నవాళ్లు ఇప్పుడు రూ.200 కోట్లు కూడా దాటేస్తుంది, నో డౌట్ అంటూ మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి రవితేజ ‘ఇరుముడి’ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో!




