Yash Toxic OTT: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఈ చిత్రవిచిత్రాలు ఎక్కువగా జరుగుతుంటాయి. భారీ తారాగణం, అంతకంటే భారీ బడ్జెట్, అంతకంటే హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటి మూవీస్ ఎన్నెన్నో చూశాం. అయితే ఇప్పుడు అంతకు మించిన రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయిన సినిమా ‘టాక్సిక్’. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ సినిమా ‘టాక్సిక్’. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే సినిమా రిలీజ్ అవ్వకముందు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా రెండు విధాలుగా మాట్లాడుకోవాలి.
‘టాక్సిక్’పై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు:
సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ సినిమాపై జనాలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే.. కచ్చితంగా ‘బాహుబలి’ రికార్డ్స్ బీట్ చేసేస్తుంది, ఇది ఒక పెద్ద సినిమాగా మారిపోతుంది. ఇక నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా కంపేర్ చేయాలి అంటే ‘టాక్సిక్’తోనే గుర్తు చేసుకుంటారు అనే రేంజ్‌లో హంగామా చేశారు. ఇక ‘టాక్సిక్’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్, మ్యూజిక్ ఈవెంట్స్ ఎంత ఘనంగా చేశారో, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారో అందరికీ తెలిసిందే.
also read:Ravi Teja Irumudi:పుష్ప, బాహుబలి రికార్డ్స్ ని తుక్కు తుక్కు చేసిన రవితేజ ‘ఇరుముడి’!
సినిమా రిలీజ్ తర్వాత అసలు బాగోతం బయటపడింది :
సేమ్ కట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా అసలు బాగోతం బయటపడింది. సినిమా అసలు ఎందుకు తీశారు? సినిమాలో కథ ఏంటి? అసలు సినిమాలో ఏముంది రా బాబు అంటూ సొంత ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు.ఇక యాక్షన్ అయితే బూతుల వర్షం కురిపించారు. నటన బానే ఉంది కానీ నటించడానికి కథ ఉంటే కదా అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అసలు కథ లేకుండా సినిమా నడిపించడం ఇదేంటి రా బాబు అంటూ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌ను వెటకారంగా ట్రోల్ చేశారు.
also read:Actress: నెగిటివ్ పాత్రలకే మక్కువ చూపుతున్న సెలబ్రిటీస్..!
రెండో రోజే భారీగా పడిపోయిన కలెక్షన్స్ :
ఈ సినిమా మొదటిరోజు దాదాపు రూ.101.5 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే రెండో రోజు మాత్రమే ఇది పూర్తిగా డౌన్‌ఫాల్ అయిపోయింది. రూ.37.65 కోట్లకు కలెక్షన్స్ డౌన్‌ఫాల్ అయిపోయాయి. సినిమా రేంజ్ ఏంటో అందరికీ అర్థం అయిపోయింది. అసలు ఈ సినిమాని చూడడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంత బూతు సినిమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
రూ.230 కోట్లకు ఓటీటీ రైట్స్? :
అయితే ఇలాంటి మూమెంట్లోనే ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించిన ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ‘టాక్సిక్’ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Yash Toxic OTT)సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అది కూడా భారీ ధరకు. ఇంత అట్టర్ ఫ్లాప్ వచ్చిన సినిమాను అంత డబ్బు పోసి కొనుగోలు చేయడం ఎందుకు అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జీ5 సంస్థ రూ.230 కోట్లకు రైట్స్ సొంతం చేసుకుంది అంటున్నారు.
దసరా కానుకగా ఓటీటీలోకి ‘టాక్సిక్’? :
అలాగే ఈ సినిమాను దసరా కానుకగా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా వైరల్‌గా మారింది. అట్టర్ ఫ్లాప్ సినిమా ఓటీటీలోకి వచ్చినా ఎవరూ చూడరు అంటున్నారు. మరికొందరు మాత్రం యష్‌పై ఉన్న అభిమానంతో ఒక్కసారైనా చూస్తారు అంటున్నారు. 2026 అక్టోబర్ చివరి వారంలో జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఓటీటీ సెన్సేషన్‌గా మారింది.




